Advertisements

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసి ఉద్యమం నడిపిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసి ఉద్యమం నడిపిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్

విద్య ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు బీజేపీ యత్నం

స్ఫూర్తిప్రదాతలను పాఠ్యాంశాల నుండి తొలగించడం దారుణం

నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాటాలే శరణ్యం

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి. శశి కుమార్

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసి ఉద్యమం నడిపిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఆ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి. శశి కుమార్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ 89వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరులోని ఎస్కేఆర్ డిగ్రీ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జి. శశి కుమార్ మాట్లాడుతూ సూర్యుడు అస్తమించని బ్రిటీష్ పాలకుల నుండి మన దేశాన్ని విముక్తి చేయడానికి ఇంగ్లీషు పాలకులను తరిమికొట్టి స్వాతంత్రోద్యమంలో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి ఉద్యమాన్ని నిర్మించిన ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ అన్నారు. స్వాతంత్రమే జన్మహక్కు అని భారతజాతి ఎలుగెత్తి నినదిస్తున్న కాలంలో, పిడికిలి బిగించి 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఉరికొయ్యలను ముద్దాడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తిగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆవిర్భవించిందన్నారు. నాటినుండి నేటి వరకు దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించడానికి, హాస్టల్స్, స్కూల్స్ , కళాశాలల్లో విద్యార్ధులు పడుతున్న సమస్యల పరిష్కారం కోసం, అమ్మాయిలపై చోటుచేసుకుంటున్న ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా యువతులకు అండగా ఉండేందుకు ఏఐఎస్ఎఫ్ పోరాట మార్గాన్ని ఎంచుకుందన్నారు. సమరశీల విద్యార్థి ఉద్యమాల నిర్మాణంలో నిమగ్నమైన అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ 88 వసంతాలు పూర్తిచేసుకుని 89వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా విద్యార్థి మిత్రులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో విద్యను వ్యాపారంగా మారుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండాను ఎలా పట్టుకోవాలో తెలియని వారు, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయని వారు నేడు జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ దేశానికి నిజమైన వారసులు దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన ఏఐఎస్ఎఫ్ సంఘ నాయకులేనన్నారు. 85 శాతం రిజర్వేషన్ల ప్రకారం కన్వీనర్ కోటాలో సీట్లు ఇవ్వాలని మిగిలిన 15 శాతాన్ని క్రీడా రంగానికి, పోలీస్ అమరవీరుల విద్యార్థులకు, ఎన్ సీసీకి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం తీసుకువచ్చి విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేయడానికి కుట్ర చేస్తోందన్నారు. దేశానికి స్ఫూర్తిదాయకులైన పూలే, భగత్ సింగ్, అంబేద్కర్, పెరియార్ నారాయణ గురు వంటి వారి జీవిత చరిత్రలను, డార్విన్ సిద్ధాంతాలను పాఠ్యాంశాల నుండి తొలగించడం దారుణమన్నారు. బ్రిటిష్ వారికి తొత్తుగా వ్యవహరించిన సావర్కర్ జీవిత చరిత్రను చేర్చి దేశ చరిత్రను వక్రీకరిస్తూ బాల్యం నుంచే విద్యార్థుల మెదడులోకి మతతత్వ భావజాలాన్ని నింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి నూతన జాతీయ విద్యా విధానం పట్ల విద్యార్థులందరూ ఏకతాటిపై కలసి పోరాటాలు చేయవలసిన అవసరం, ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ నాయకులు ప్రమోద్, ప్రణయ్, సుమంత్, ముకేష్, మహిళా నాయకురాలు హారిక, రెడ్డమ్మ, జోష్ణ, లీలావతి, నందిని తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This