నెల్లూరు జిల్లా
నూతన ప్రభుత్వం ఏర్పడక జరిగిన ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిషత్ తొలి సమావేశం నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన సమావేశానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి,పొంగూరు నారాయణ ,ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి ,పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలుఈ సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి వెంకటగిరి నియోజకవర్గం కి సంబంధించిన అల్తూరుపాడు బ్యాలెన్సింగ్ జలాశయము మరియు అల్తూరుపాడు ఎత్తిపోతల పథకం గురించి మరియు గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్యాకేజి-40 గురించి మాట్లాడడం జరిగింది.నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గం,డక్కిలి మండలంకి సంబంధించిన అల్తూరుపాడు జలాశయము ఎంత శాతం జరిగింది,సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ పనుల్లో అటవీ అనుమతిలలో జాప్యం కారణంగా రద్దు చేయడం జరిగిందా అని అడిగారు.దీనిలో నిజం ఎంత అని అడిగారు.253.774 కోట్ల అంచనాలతో మొదలు పెట్టిన పనులు ఈ రోజు 550 కోట్లకి పెంచడం జరిగింది.అంచనాలు పెరిగాయి గాని 6 శాతం పనులే పూర్తి కావడం జరిగింది అని ఈ జాప్యం వల్ల అల్తూరుపాడు గ్రామ రైతులు మరియు ప్రజలు తీవ్రంగా నష్టపోయారు అని తెలియజేశారు.గతంలో వెంకటగిరి శాసనసభ్యులుగా ఉన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి తాను కలిసి అనేక పర్యాయాలు డక్కిలి మండలంలో పర్యటించినప్పుడు ఈ జలాశయమును గురించి డక్కిలి మండల రైతులు అనేక మార్లు తమని ఈ పనిలోని పురోగతి కొరకు అభ్యర్థించారని మంత్రి కిగుర్తు చేసిన ఎమ్మెల్సీ.ఇప్పటికైనా మంత్రి మరియు ప్రభుత్వం పూనుకొని ఈ జలాశయము పనులను త్వరగా మొదలుపెట్టి రైతులు కష్టాలు తీర్చాలి అని కోరడం జరిగింది.అదేవిధంగా అల్తూరుపాడు ఎత్తిపోతల పథకం 40 శాతం పని పూర్తి అయింది అని మిగిలిన బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేసి వెంకటగిరి నియోజకవర్గ రైతులను ఆదుకోవాలని మంత్రి ని కోరిన ఎమ్మెల్సీ.గూడూరు నియోజవర్గానికి సంబంధించి ప్యాకేజీ -40 సత్యసాయి గంగా కాలువ యొక్క 5,5A బ్రాంచ్ కాలువలు గూడూరు నియోజకవర్గంలోని గూడూరు,చిల్లకూరు,కోట మండలాల్లో ఏయే గ్రామల గుండ వెళ్తుందో ఆ గ్రామాలలో ఎక్కడైనా ఈ కాలువ పనులు ఆగి ఉన్నాయి అని వాటి యొక్క వివరాలు తెలపవలసిందిగా అధికారులను కోరడం జరిగింది.ఈ మూడు మండలాల్లోని 66909 ఎకరముల ఆరుతాడి మరియు 22718 ఎకరముల స్థిరీకరణకు సాగు నీరు సరఫరా చేయడానికి నిర్దేశించడమైన కాలువ యొక్క పనులు 98 శాతం పూర్తి అయినవి అన్న విషయంలో ఎంత వరకు నిజం ఉంది అని అధికారులను నిలదీశారు.నెల్లూరు జిల్లా 24 పాఠశాలల్లో జరిగిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు గురించి జిల్లా విద్యాధికారి సరిగా వ్యవరించలేదు అని ఈ ఎన్నికలకు సంబంధించి అనేక చోట్ల అభ్యంతరాలు రావడం జరిగింది అని దీని మీద తగు చర్యలు తీసుకోని త్వరితగతిన ఎన్నికలు పూర్తి చేయాలి అని జిల్లా విద్యాధికారిని కోరడం జరిగింది.చివరిగా ఎమ్మెల్సీ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గారిని,జిల్లా పరిషత్ ముఖ్య నిర్వహణ అధికారి ఉద్దేశించి మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఏర్పడిన నాటి నుండి ఎప్పటి వరకు జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో 10 శాతం కి మించి తిరుపతి జిల్లా అధికారులు ఎప్పుడు హాజరుకాలేదు అని ఈ సమావేశంలో తొలిసారిగా 90 శాతం పైన అధికారులు హాజరుకావడం మంచి పరిణామం అని ఈ దిశగా తిరుపతి జిల్లా అధికారులని పాల్గొనేలా చేసిన మంత్రులకు,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మరియు జిల్లా పరిషత్ ముఖ్య నిర్వహణ అధికారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది…