మహిళలకు ప్రత్యేకంగా కళాశాల ఉండాలని 1980 సంవత్సరంలోనే ప్రముఖ వ్యాపారవేత్త ఆల్లారెడ్డి శ్యాంసుందర్ రెడ్డి ,డాక్టర్ సిఆర్ రెడ్డి ఎంతో కృషి చేసి గూడూరు పట్టణంలో DRW మహిళా కళాశాలను స్థాపించి ఎంతో ఉన్నత స్థాయికి కళాశాలను తీసుకురావడం సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు గూడూరు పట్టణంలోని డి ఆర్ డబ్ల్యు మహిళా కళాశాలలో డాక్టర్ సిఆర్ రెడ్డి ,శ్యాంసుందర్ రెడ్డి విగ్రహాలను మాజీ ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు
గూడూరు పట్టణంలోని డి ఆర్ డబ్ల్యు కళాశాలలో ఏర్పాటుచేసిన ఆల్లారెడ్డి శ్యాంసుందర్ రెడ్డి ,డాక్టర్ సిఆర్ రెడ్డి విగ్రహాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ,గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ,ప్రముఖ వైద్యుల సీఎం కే రెడ్డి ,పట్టణ ప్రముఖులు కాలేజీ యాజమాన్యం ఆవిష్కరించారు అనంతరం డాక్టర్ సి ఆర్ రెడ్డి జీవిత చరిత్ర గ్రంథాన్ని మాజీ ఉపరాష్ట్రపతి విడుదల చేశారు పలువురు పట్టణ ప్రముఖులతో మాజీ ఉపరాష్ట్రపతి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ గూడూరు ప్రాంతం నుండి చెన్నైకి వెళ్లి ప్రముఖ వ్యాపారవేత్తగా స్థిరపడిన శ్యామ్ సుందర్ రెడ్డి ప్రజా డాక్టర్ గారు డాక్టర్ సి.ఆర్.రెడ్డి మహిళలు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆలోచనతో 1980 సంవత్సరంలో మహిళల కొరకు ప్రత్యేక కళాశాలను ఎంతో కష్టపడి ఏర్పాటు చేశారని అన్నారు ఈరోజు ఈ కళాశాల రాష్ట్రస్థాయిలో ఎంతో గుర్తింపు పొంది వేలాదిమంది జీవితాలకు ఉన్నత బాట చూపించిందని వీరి విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఈతరం రాబోయే తరాల వారికి స్ఫూర్తిని ఇస్తుందని అన్నారు మహిళలు చదువుకోవడం వల్ల కుటుంబం ఎంత అభివృద్ధి చెందుతుందని డాక్టర్ సిఆర్ రెడ్డి లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని వారికి తోచిన సహాయ కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ సి ఆర్ రెడ్డి గూడూరు కె ఒక బ్రాండ్ అని ఆ మహానుభావుడు మహిళల కొరకు DRW కళాశాలను స్థాపించి గూడూరుకు ఎంతో గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు ఆ మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని కళాశాల ఇంకా మరి ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సీఎం కే రెడ్డి ,మెహర్ మని ,డాక్టర్ రోహిణి ,హనుమంతరావు ,తదితరులు పాల్గొన్నారు .