సుప్రీంకోర్టు తీర్పు మాల మాదిగల మద్య అగాధం సృష్టిస్తుంది ,గూడూరు, ఉదయం ప్రతినిధి ,ఆగస్టు 7 ,యస్ సి ల ఏబిసిడి వర్గీకరణ పై గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాల మాదిగల మద్య అగాధం సృష్టించబడతుందని మాలమహానాడు నేత గోను శివకుమార్ అభిప్రాయపడ్డారు. బుధవారం గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద నున్న అంభ్యేద్కర్ విగ్రంహం వద్ద నల్ల బ్యాడ్జిలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ యస్ సి ల వర్గీకరణ పై ఏబిసిడి లు కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు కు మాలమహానాడు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు ఆందోళన చేపట్టామని అన్నారు. సుప్రీంకోర్టు ఏబిసిడి లు అమలు చేయవచ్చని తీర్పు ఇవ్వడం తో ఐక్యమత్యం గా ఉన్న మాల మదిగలు మద్య చిచ్చుపెట్టిన ట్లైందని గోను శివకుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మాల మహానాడు ఆద్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అలాగే మాలలు కూడా శాంతి వాతావరణం లో ఆందోళనలు చేపట్టాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో మాలమహానాడు నేతలు చింతల చిరంజీవి, పిండి మనోహర్, గార బాబు, పుట్టా శంకరయ్య ,పర్వాతాల శివయ్య ,బూసి శీను ,శ్రీకాంత్ ,ప్రశాంత్ ,దాసరి కృష్ణ ,బాబు ,సారధి ,సాంబయ్య ,పోలయ్య ,రత్నం. సుమారు మాలమహానాడు కార్యకర్తలు వందమంది పాల్గొన్నారు.