Advertisements

విద్యార్థి క్రాంతి కిరణ్ కు 1 లక్ష 20 వేల రూపాయల ఆర్ధిక సహాయంనుఅందించిన శాసన సభ్యులు పాశిం సునీల్

చిల్లకూరు మండలం నందున్న జిందాల్ పవర్ ప్లాంట్ కంపెనీ వారి సౌజన్యంతో తమ్మినపట్నం గ్రామం నందు ఇంటర్ చదువుటకు స్థోమత లేని పేద విద్యార్థి క్రాంతి కిరణ్ కు 1 లక్ష 20 వేల రూపాయల ఆర్ధిక సహాయంను పట్టణంలోని క్యాంప్ కార్యాలయం నందు విద్యార్థికి అందించిన శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్

మాట్లాడుతూ….

జిందాల్ కంపెనీ వారు CSR నిధులతో ఇలా పేద విద్యార్థులకు సహాయం చేయడం ఎంతో సంతోషం.ఈ కంపెనీ లాగే నియోజకవర్గంలో ఉన్న కంపెనీ వారు ఇలా పేద విద్యార్థులకు సహాయం చేస్తే నియోజకవర్గంలో విద్యార్థులు చదువుకు ఉపయోగకరంగా ఉంటుంది అని అన్నారు.10th క్లాస్ చదివే పేద మహిళా విద్యార్థులు ఈ కంపెనీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి స్కాలర్ షిప్ అందిస్తామని చెపుతున్నారు.కావున నియోజకవర్గ పేద మహిళ విద్యార్థినులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారుఈ కార్యక్రమంలో జిందాల యాజమాన్యం, పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, వెంకన్నపాలెం సర్పంచ్ కోకొల్లు మధు యాదవ్, చిల్లకూరు మండల మహిళా అధ్యక్షురాలు నెలటూరు సుప్రజ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Comment