Advertisements

గూడూరు తిరుమల బస్ సర్వీసులను పునరుద్దించాలి

గూడూరు తిరుమల బస్ సర్వీసులను పునరుద్దించాలి : బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరి మనోజ్ కుమార్
గూడూరు ఆర్టీసీ డిఎం వెంకటేశ్వర్లు గారికి వినతిపత్రం అందజేసిన బీజేవైఎం నాయకులు
భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీ గారి ఆదేశాల మేరకు మరియు బీజేవైఎం తిరుపతి జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి సూచనల మేరకు గూడూరు తిరుమల బస్సు సర్వీసులను పునరుద్దించాలని గూడూరు ఆర్టీసీ డిఎం వెంకటేశ్వర్లు గారికి వినతి పత్రం అందజేసిన బీజేవైఎం నాయకులు ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ కరోనాకు ముందు గూడూరు రైల్వే స్టేషన్ నుండి దాదాపు 5 బస్ సర్వీసులో గూడూరు తిరుమలకు ఉండేవని , కానీ కరోనా తర్వాత అవి తీసేయడం జరిగిందని, పలు రాష్ట్రాల నుండి తిరుమల కు గూడూరు నుండి అనేకమంది భక్తులు వెళ్తున్నారని, వారి సౌకర్యార్థం వెంటనే గూడూరు తిరుమల బస్ సర్వీసులను పునరుద్దించి తోడ్పడాలని ఆయన అన్నారు అదేవిధంగా గూడూరు డివిజన్లో అనేకమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారని గూడూరు బెంగుళూరు బస్ సర్వీస్ ని కూడా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గూడూరు డిపో మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ బీజేవైఎం నాయకులు కిరణ్ మహేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This