గూడూరు మండలం చెన్నూరు గ్రామం లో *గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్* ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా మన ముఖ్యమంత్రి *చంద్రబాబు నాయుడు* ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జులై నెలలో 7000పింఛన్ ను పంపిణీ చేయడం జరిగింది అన్నారు.చంద్రబాబు మాట ఇస్తే కచ్చితంగా చేస్తారన్నారు. పింఛన్ లు పంపిణీ చేసేటప్పుడు అవ్వ తాత ల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే చాలా సంతోషం గా ఉందని, అలాగే అన్నీ రకాల సామాజిక పింఛన్లు పంపిణీ చేయడం ఆనందం గా ఉందన్నారు. ఈరోజు పొద్దున్న ఆగస్టు నెలకి సంబందించిన 4000పింఛన్ పంపిణీ చేయడం జరిగింది వికలాంగులకు 15000 పింఛన్ పంచడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు యరమాపు. హేమంత్ రెడ్డి,ఇందుకూరు.శ్రీకాంత్ రెడ్డి,అల్లం.కృష్ణయ్య,కటికాల.శ్రీనివాసులు,శ్యామల,మేఖల.భాస్కర్,నాగేంద్ర,,అశోక్,శైలజ,గోవిందమ్మ, మౌనిక,శివ,రవి కుమార్ ,వెంకటేశ్వర్లు,కృష్ణమూర్తి,బుజ్జరమనయ్య,కృష్ణ,చెంచయ్య,శ్రీనివాసులు,గోవర్ధన్ సచివాలయం కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు.