గూడూరు పట్టణం 15వ వార్డు తూర్పువీధి ST కాలనీ నందు నాయకులు మరియు అధికారులతో కలసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్
ఒకటో తేదీన ఉదయం నుంచి పింఛన్ పంపిణీ చేయడంపై లబ్ధిదారుల్లో ఆనందం
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పింఛన్ ను రూ.4 వేలు నుంచి రూ.15 వేలు వరకు అందజేయడం అద్భుతం దేశంలో రూ.30తో సామాజిక పింఛన్ పథకానికి శ్రీకారం చుట్టిందే మహానుభావుడు ఎన్టీఆర్ గారు, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నది నారా చంద్రబాబు నాయుడు రూ.2 వేలు పింఛన్ ను రూ.3 వేలకు పెంచడానికి గత ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టిందని అన్నారు.చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కసారిగా రూ.4 వేలుకి పెంచి లబ్ధిదారులు ప్రశాంతంగా జీవించే అవకాశం కల్పించారని అన్నారు.
దేశంలోనే ఈ స్థాయిలో పింఛన్లు అందజేస్తున్నది ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే..ఇది చాలా అరుదైన ఘనతఅలాగే కొందరు YCP వారు సోషల్ మీడియా లో Fake న్యూస్ లు పోస్ట్ లు చేస్తున్నారు. మీ నాయకుడి లా మా నాయకుడు చేయరు గుర్తుపెట్టుకోండి. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెంచి ఇస్తానన్న మాట మీద నిలబడి పెన్షన్ ఇస్తున్నారు.కావున గుర్తుపెట్టుకోండి మీలా మాటల ప్రభుత్వం కాదు మాది,చేతల ప్రభుత్వం కాబట్టే చేసి చూపుతున్నాం అని అన్నారు. వార్డు లో చాలా సమస్యలు ఉన్నాయని ఈ వార్డు ని నేను దత్తత తీసుకుని ఇక్కడ రోడ్లు, డ్రైన్ లు, లైట్ లు అన్ని ఏర్పరుస్తానని అన్నారు.