గురు పూర్ణిమ సందర్భంగా గూడూరు శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం నందు శనివారం రాత్రి గూడూరు యోగ నరసింహ కోలాటం భజన మండలి ఆధ్వర్యంలో స్థానిక మహిళలు,చిన్నారులు కోలాటం, భజన కార్యక్రమాలను నిర్వహించారు. కోలాట కార్యక్రమాన్ని శ్రీమతి,శ్రీ ఉమ మహాలక్ష్మి ఎస్.ఎల్.ఎన్ స్వామి పర్యవేక్షించారు.సాయి నాథుని స్మరిస్తూ నిర్వహించిన భజన,కీర్తనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.