అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తాం-జర్నలిస్టులను వేధిస్తే సహించం
గూడూరు జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ వెల్లడి.
అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తాం
జర్నలిస్టులను వేధిస్తే సహించం
అన్నీ ప్రభుత్వశాఖల కు అండగా ఉంటాం
ప్రజలకు ప్రభుత్వానికి వారిది జర్నలిస్ట్
సమాజం కోసం పోలీస్ వ్యవస్థతో పోటీపడి పనిచేసే వాళ్ళు జర్నలిస్ట్ లు
సమాజంలో ఫోర్త్ పిల్లర్ జర్నలిజం
విలేకరుల పై తప్పుడు కేసులు పెట్టడం సరికాదు
విలేకరుల పై షోషల్ మీడియా లో తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం
అదే రీతిలో అధికారులు పై కూడ తప్పుడు ప్రచారం చేస్తే జర్నలిస్ట్ సంఘాలు మద్దత్తు ఉంటుంది
త్వరలో జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో లీగల్ సెల్ ఏర్పాటు
ప్రతీ మండలం లో జర్నలిస్ట్ సంఘాలు ఏర్పాటు
త్వరలో గూడూరు లో వందలాది మంది జర్నలిస్ట్ లతో భారీ సమావేశం ఏర్పాటు
అధికార ప్రభుత్వంకు అండగా ఉంటాం
గూడూరు ఎమ్మెల్యే చేసే కార్యక్రమాలకు జర్నలిస్ట్ సంఘాలు మద్దత్తు
జర్నలిస్ట్ ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోము
గూడూరు జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ
విలేకరులపై నమోదైన అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామని, జర్నలిస్టులను వేధిస్తే సహాంచేది లేదని జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ మీజూరు మల్లికార్జున రావు, కన్వీనర్ జీ. బాబూ మోహన్ దాస్ లు తెలిపారు. గురువారం గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం తాళమ్మ దేవస్థానం ఆవరణంలో జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ కు అనుబంధంగా జాయింట్ యాక్షన్ కమిటీని ఎన్నుకున్నారు.
ఇటీవల కాలంలో గూడూరు ప్రింట్ మీడియా అసోసియేషన్ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొందరు తప్పుడు కేసులు పెట్టించడం, సోషల్ మీడియా ద్వారా వేధించడం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జేఏసీ ఛైర్మన్ మీజూరు మల్లి కార్జున్ రావు మాట్లాడుతూ గూడూరు ప్రింట్ మీడియా అసోసియేషన్ లోని జర్నలిస్టులపై కొందరు ముఠాగా ఏర్పడి అక్రమ కేసులు పెట్టించడం, వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు.
అటువంటి వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. వారి దుశ్చర్యలతో పోలీసులు పెట్టిన అక్రమ కేసులపై న్యాయపోరాటం సాగిస్తామన్నారు. అధికారులు జర్నలిస్టులపై తప్పుదారిపట్టించి అసత్య ఫిర్యాదులు చేసేవారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రింట్ మీడియా విలేకరులు ప్రజలకు ప్రభుత్వానికి నడుమ వారధులుగా ఉంటూ నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. జర్నలిస్టులపై కుట్రలు పన్నుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ కేసులు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ జీ. బాబుమోహన్ దాస్ మాట్లాడుతూ కొంతకాలంగా గూడూరు జర్నలిస్టులపై అసత్య ప్రచారాలు చేయడం నకిలీ విలేకరుల ముఠాకు పరిపాటిగా మారిందన్నారు. ప్రజా సంఘాల పేరుతో, జర్నలిజం ముసుగులో సీనియర్ జర్నలిస్టులను వేధించడం, కేసులు పెట్టించడాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని స్పందిస్తుందన్నారు. సీనియర్ జర్నలిస్టులపై ఆగడాలను నియంత్రించడం కోసం న్యాయపోరాటమే లక్ష్యంగా జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తుందని తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిస్ట్
ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిస్ట్ ఉంటాడు అనీ సమాజం లో నాలుగో పిల్లర్ గా జర్నలీజం ఉంటుందనీ గూడూరు జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ వెల్లడించింది. అన్నీ ప్రభుత్వ శాఖల అధికారులకు గూడూరు జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ అండగా ఉంటుందనీ తెలిపారు. పోలీసులుకు ధీటుగా సమాజం కోసం శ్రమించే వారు జర్నలిస్ట్ లు అని తెలిపారు.అధికారులు జర్నలిస్ట్ ల మద్య మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలని జాయింట్ యాక్షన్ కమిటీ పేర్కొంది. త్వరలోనే జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ అడ్వాకెట్స్ లతో లీగల్ సెల్ ఏర్పాటు, ప్రతీ మండలం లో జర్నలిస్ట్ యూనియన్ లు ఏర్పాటు అతి త్వరలో గూడూరు లో భారీ ఎత్తున వందలాది జర్నలిస్ట్ లతో సమావేశం ఉంటుందనీ కమిటీ వెల్లడించింది.
ఈ సమావేశంలో గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ జమాలుల్లా, ఉడతా శరత్ యాదవ్, గౌరవ సలహాదారులు మనోహర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బాలకృష్ణ గౌడ్, జాయింట్ సెక్రటరీ తిరుమలశెట్టి భవానీ, సహాయ కార్యదర్శి తులసీరాజు, కార్యవర్గ సభ్యులు ప్రసాద్, శశి, కిషోర్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
గూడూరు జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ కార్యవర్గం
*గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అనుబంధంగా గూడూరు జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ కన్వీనర్ గా జీ. బాబుమోహన్ దాస్, ఛైర్మన్ గా మీజూరు మల్లికార్జున రావు, సభ్యులుగా అనిల్ కుమార్ (నాని), నన్నూరు లక్ష్మణ్, డీ. కృపానిధిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.