హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలు
కాపాడుకోవచ్చు.
వేగం కన్నా ప్రాణం మిన్నా
ప్రతిఒక్క వాహనదారులు హెల్మెట్ ధరించాలి
హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం
రూరల్ -సిఐ, ఎస్ ఐ
గూడూరు పట్టణం:- బైపాస్ సర్కిల్ వద్ద వాహనా దారులు ప్రతిఒక్కరు హెల్మెట్ ధరించాలని రూరల్ సి ఐ, వేణుగోపాల్ రెడ్డి, ఏస్ ఐ మనోజ్ కుమార్ తెలిపారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో బై పాస్ సర్కల్ వద్ద వాహన చోదకులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. అనుకోని పరిస్థితుల్లో జరిగే ప్రమాదాల్లో హెల్మెట్ ఉండడం వలన ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ వచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
ట్రాపిక్ నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ వాహనాలు నడపాలని తెలిపారు.
టూవీలర్ పై ముగ్గురు ప్రయాణించడం, అధిక వేగంతో బై క్ నడపడం , ట్రాపిక్ నియమ నిబంధనలకు విరుద్ధమని అటువంటి ప్రయాణికులు పైన్ వేస్తామని హెచ్చరించారు.
వాహనాదారులు వాహనానికి సంబంధించిన సరైనా పత్రాలు కలిగి ఉండాలని తెల్పారు .