Advertisements

గంజాయిని అక్రమంగా తరలిస్తున్నముగ్గురు ముద్దాయిల అరెస్ట్.

గూడూరు రైల్వే పార్సిల్ ఆఫీస్ వద్ద, గూడూరు..

ముగ్గురు ముద్దాయిల వద్ద నుండి సుమారు రూ.1,17,000/- ల విలువ గల సుమారు 23.4 కేజిల గంజాయి మరియు NOKIA, OPPO సెల్ ఫోన్ లను స్వాధీనం. అనకాపల్లి నుండి చెన్నై కు తరలిస్తుండగా గూడూరు రైల్వే పార్సిల్ ఆఫీస్ వద్ద చాక చక్యంగా పట్టుకున్న గూడూరు 1 టౌన్ పోలీసులు. మద్యం, గుట్కా, గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని జిల్లా యస్.పి. ఆదేశాల మేరకు ముమ్మరముగా తనిఖీ చేస్తున్న అధికారులు.
ఎవరైనా గంజాయి ని కలిగి ఉన్న, రవాణా చేసిన మరియు అమ్మిన అట్టి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోబడును. అట్టి వారిపై హిస్టరీ షీట్ లను ఓపెన్ చేసి గట్టి నిఘా ఉంచడం జరుగుతుంది.ఎవరైనా 2 లేక 3 సార్లు గంజాయి కేసులో పట్టుబడితే అట్టి వారిపై PD-ACT చట్టం క్రింద కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని పోలీసులు వారు తెలిపారు.

Leave a Comment