ఫుడ్ పాయిజన్ తో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన గూడూరు రెవిన్యూ డివిజనల్ అధికారి యం. కిరణ్ కుమార్
గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులందరికీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యుల ఎప్పటికప్పుడు పరీక్షల నిర్వహిస్తున్నారని గూడూరు ఆర్టీవో కిరణ్ కుమార్ వెల్లడించారు.
నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నాయుడుపేట, గూడూరు ,నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మంగళవారం గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులను గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్ పరామర్శించి ఆరోగ్యం పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పై ఆర్టీవో కిరణ్ కుమార్ వైద్యులతో చర్చించారు.అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ కలుషితమైన ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురై 30 మంది విద్యార్థులు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి బాగుందని ఇద్దరిని నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించడం జరిగిందని ఎప్పటికప్పుడు వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు.ఆసుపత్రిలో పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.అదే విధంగా అక్కడే ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులతో కూడా చర్చించారు. ఆర్డీవో వెంట మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, వైద్యులు ఉన్నారు.