Advertisements

వికలాంగ వృద్ధురాలికి వాకర్ పంపిణీ

బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికలాంగ వృద్ధురాలికి వాకర్ పంపిణీ చేశారు. గూడూరు మున్సిపల్ పరిధిలోని చెన్నూరు గిరిజన కాలనీలో అనాధ వికలాంగ వృద్ధురాలికి వెలుగు సిసి ఆత్మకూరు శేషు జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆత్మకూరు సురేష్ చేతుల మీదుగా ఆ వృద్ధురాలికి వాకర్, పండ్లు పంపిణీ చేశారు. ఆధార్ కార్డు,రేషన్ కార్డు కూడా లేదని అందు వల్ల పించన్ కూడా రావడం లేదని ఆమె వాపోయింది.రేషన్ కార్డు,ఆధార్ కార్డు ఇప్పించి పించన్ వచ్చేలా సాయం చేయాలని ఆమె కోరింది.స్పందించిన అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్,ఆర్డీఓ కిరణ్ కుమార్ లకు వివరించి సాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వెలుగు సీసీ పనబాక కోటేశ్వర రావు, సీనియర్ జర్నలిస్ట్ బాలకృష్ణ తదితరులున్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This