Advertisements

ప్రత్యేక గ్రీవెన్ సెల్ లో ఎమ్మెల్యే, ఆర్డీఓలకు సీపీఐ నాయకుల వినతి

పట్టణ సమస్యలకు సత్వర పరిష్కారం చూపండి
భూగర్భ గ్యాస్ పైప్ లైన్ తో ఏర్పడిన గుంతలు పూడ్చాలి
-ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించాలి
తాగునీటి సమస్యకు శాస్వత పరిష్కారం చూపాలి

 –అంబేద్కర్ భవన నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలి

ప్రత్యేక గ్రీవెన్ సెల్ లో ఎమ్మెల్యే, ఆర్డీఓలకు సీపీఐ నాయకుల వినతి
గూడూరు : పట్టణంలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కోరుతూ సీపీఐ నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల దినోత్సవంలో ఆర్డీఓ, ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్. ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి జీ. శశి కుమార్, పట్టణ కార్యదర్శి షేక్. కాలేషా తదితరులు మాట్లాడుతూ పట్టణంలో ప్రధానంగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం 63 కోట్ల రూపాయలతో కండలేరు క్రీక్ నుండి గ్రావిటీ సిస్టంతో 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూరుకు పైప్ లైన్ తో మంచినీటి సరఫరా ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. ఈ ప్రాజెక్టు నిబంధన మేరకు పట్టణానికి 24గంటలూ మంచినీరు అందించాల్సి ఉండగా కేవలం రోజుకు అరగంట మాత్రమే అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో నాశిరకం పైపులను వాడడం వలన నిత్యం పైప్ లీకేజీ సమస్యలతో నెలకు పది రోజులపాటు పట్టణానికి మంచినీటి సరఫరాలో అంతరాయం కలిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజీ అండ్ పీ సంస్థ పట్టణంలో భూగర్భ గ్యాస్ పైప్ లైన్ కోసం సీసీ రోడ్లను పగులగొట్టి గుంతలమయం చేశారన్నారు. ఈ గుంతల్లో పడి అనేకమంది ప్రజలు గాయాలపాలయ్యారని గుర్తుచేశారు. పట్టణ నడిబొడ్డులో శిథిలావస్థకు చేరిన అంబేద్కర్ భవనం స్థానంలో వెంటనే నూతన భవనాన్ని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పట్టణంలోని వంట గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కొంతమంది ప్రజల నుండి సిలిండర్ కు 30 నుండి 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు, 7వ వార్డు మాజీ కౌన్సిలర్ ఎంబేటి చంద్రయ్య మాట్లాడుతూ 7వ వార్డు అశోక్ నగర్లోని ఆడిటోరియంను లెవల్ చేయించాలన్నారు. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ఓపెన్ ఆడిటోరియంగా నామకరణం చేయాలన్నారు. అలాగే ఆ ప్రాంతంలోని రీడింగ్ రూమ్ ఆక్రమణలను తొలగించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్, ఆర్డీఓ ఎం. కిరణ్ కుమార్ లకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు సీహెచ్. ప్రభాకర్, జీ. శశి కుమార్, షేక్ కాలేషా, ఎంబేటి చంద్రయ్య, ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా, మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు యాకోబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This