శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్, సంస్థ వారు రేణిగుంటలో గత కొన్ని సంవత్సరాలుగా వైద్య సేవలు చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుల్లెట్ రమణ SBMC వారిని సంప్రదించి తిరుపతి ఇందిరా నగర్ లో భారీ మెగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బులెట్ రమణ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో అధికారం ఉన్నా కూడా ప్రజల కోసం మెడికల్ క్యాంప్ మాత్రమే కాకుండా ఎటువంటి ప్రయోజనాలు కూడా ప్రజల దగ్గరకు చేరలేదు, వైసిపి ప్రభుత్వంలో నాయకులు వారి స్వార్థం వారి కుటుంబ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసుకున్నారు. వారికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తూ వచ్చారు. దొంగల ప్రభుత్వం పోయింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి ఈ ఐదేళ్ల పాలనలో జరగబోయే అభివృద్ధిని చూసి మనస్ఫూర్తిగా సంతోషంతో ఉంటారని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటానని హర్షం వ్యక్తం చేశారు. ఈ మెడికల్ క్యాంపులో సుమారు 2000 పైన ప్రజలు వైద్యం చేసుకున్నారు వారికి ఉచిత మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథం, బుల్లెట్ మాక్సి ,రాజారామ్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర మీడియా కార్యదర్శి రమేష్ ,ప్రేమ్ కుమార్, ఆనంద్,త్యాగరాజులు, దుర్గం ఆదినారాయణ రెడ్డీ, లోహిత్, గంగ రాణి,లలితమ్మ,రాణెమ్మ,మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.