అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. అమరావతి అనేది గతంలో ప్రముఖ నగరమని, రాష్ట్ర విభజన జరుగుతుందని, అమరావతి రాజధాని అవుతుందని ఎవరూ ఊహించలేదని, రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీగ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సూచించారని ఆయన తెలిపారు.ప్రపంచంలోనే అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అమరావతి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇది ఏ ఒక్కరి రాజధాని కాదని, యావత్ రాష్ట్ర ప్రజలదని తెలిపారు. ప్రతి తెలుగు బిడ్డ అమరావతి నాది అని గర్వంగా గుర్తించి చెప్పుకోవాలన్నారు. కొత్తగా ప్రణాళికలు ఏమీ లేవని, పాత వాటినే కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామని తెలిపారు.హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవం ఉంది : రాజధాని ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. బ్రిటీష్ మ్యూజియంలోనే అమరావతి శిల్పాలకు ఓ ప్రత్యేక మైన గ్యాలరి పెట్టారని అన్నారు. అమరావతి అనేది గతంలో ప్రముఖ నగరమని, రాష్ట్ర విభజన జరుగుతుందని, అమరావతి రాజధాని అవుతుందని ఎవరూ ఊహించలేదని, రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీగ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సూచించారని ఆయన తెలిపారు. కేబినెట్లో పెడితే అందరూ అంగీకరించారని, అలాగే ప్రజల నుంచి కూడా ఆమోదం వచ్చిందని తెలిపారు.యమునా నది నీరు, పార్లమెంట్ మట్టిని మోదీ తెచ్చారని, వాటి మహిమ అమరావతిలో ఉందని అన్నారు. రాష్ట్రంలో ఎటుచూసినా సమదూరంలో ఉన్న ప్రాంతం అమరావతి. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవం తనకు ఉందని, తొమ్మిదేళ్లలో సైబరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని, కృష్ణానది నుంచి నీళ్లు తెచ్చి సైబరాబాద్‌కు ఇచ్చామని అన్నారు.కొత్తగా ప్రణాళికలు ఏమి లేవు పాత వాటినే కొనసాగిస్తాం : జగన్ ప్రభుత్వం జాతికి ద్రోహం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు మొదలు పెట్టినా తాను నిమిత్త మాత్రుడినేనన్నారు. రాష్ట్రం రాజధాని లేకుండా మిగిలి పోయిందని అన్నారు. హైదరాబాద్ తెలంగాణకు రాజధాని అయ్యిందని, ఏపీకి రాజధాని లేకపోవడం వల్ల పెట్టుబడులు ఆగిపోయాయన్నారు. ఏం చూసి రావాలని అంతా అడుగుతున్నారన్నారు. ఒక వ్యక్తి శాపంగా మారాడని, ప్రజల పట్ల దురదృష్టంగా దాపురించాడని మండిపడ్డారు.ఇక్కడ అవకాశాలు ఉంచుకుని ఎక్కడకో ఎందుకు వెళ్లాలని సీఎం ప్రశ్నించారు. తూర్పున ఉన్న సన్ రైజింగ్ రాష్ట్రం ఏపీ అని అన్నారు. కీలక మైన పోస్టులకు ఇలాంటి వ్యక్తులు అర్హులా కాదా అన్న అంశాన్ని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే అభివృద్ధికి నాంది పలకాలని అన్నారు. కొత్తగా ప్రణాళికలు ఏమి లేవు పాత వాటినే కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామని తెలిపారు. గతంలోనే ఎకరా 10 కోట్ల విలువ పలికిందని చంద్రబాబు తెలిపారు.గత ప్రభుత్వం ఒక యజ్ఞంలా అమరావతిని నాశనం చేసింది : 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజధాని నిర్మిస్తే దాని నుంచి వేల కోట్ల ఆదాయం వచ్చేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదారాబాద్‌లో ఇపుడు ఆదాయం వస్తోందని చెప్పారు. 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమి విక్రయించి రాజదాని నిర్మిస్తే అక్కడి నుంచే నిర్మాణాలు మొదలయ్యేవని స్పష్టం చేశారు. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న సంస్థలు ఇక్కడికి వచ్చేవి సంపద పెరిగేదని వెల్లడించారు.ఒక యజ్ఞంలా చేసిన ప్రయత్నాలకు గత ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు. దుష్ట శక్తుల నుంచి అమరావతి తనను తాను కాపాడుకోలేక పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పునరుద్ధరణ పనులు నిన్నటి నుంచే మొదలు అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం రైతులపై పెట్టిన కేసులను సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాజధాని మారుస్తామన్న వ్యక్తిని తాను ఎవరిని చూడలేదన్న చంద్రబాబు, అలాంటి పిచ్చి వాళ్ళ నుంచి రక్షించడానికి ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేశారు. న్యాయ పరమైన అంశాలు పరిశీలించి అమరావతి పునర్నిర్మాణం చేస్తామన్నారు. కొందరు తన ఉద్దేశాలను, లక్ష్యాలను సరిగ్గా అర్థం చేసుకోలేక పోయి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.మన ఆస్తుల విలువ కూడా తగ్గింది : అమరావతిలో 14 ఎకరాల్లో హ్యాపీ నెస్ట్ ద్వారా మధ్య ఆదాయ వర్గాలకు ఇళ్ల చేపట్టాలని భావిస్తే దానిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపేసిందని చంద్రబాబు ఆరోపించారు. పనుల నిలిపి వేత కారణం వ్యయం పెరిగి నష్టం జరిగిందని తెలిపారు. అమరావతిలో నిర్మించిన భవనాలు దెబ్బతిన్నాయన్నారు. రహదారులు, మౌలిక వసతుల దెబ్బతిన్నాయని, ఆర్థిక సంస్థలు వద్ద మన రేటింగ్ కూడా పడిపోయిందని చెప్పారు.ఏపీకి రాజధాని లేదు అన్న కారణంగా పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు, ఉపాధి లేదు అంతా నష్ట పోయిందని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం చేసిన అరాచకం వల్ల జరిగిన నష్టం ఇదని విమర్శించారు. ప్రపంచ స్థాయి నగరం వస్తే ప్రత్యక్ష, పరోక్ష పన్నులు ఆదాయం వస్తుందని, సంపద పెరుగుతుందని చెప్పారు. ఇప్పుడు అది ప్రజలే నష్టపోయారని, మన ఆస్తుల విలువ కూడా తగ్గిందని తెలిపారు.