Advertisements

పెన్షన్ల పంపిణీ ప్రారంభం తెలుగుదేశం హయాంలోనే

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్

గూడూరు : తొలిసారిగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది టీడీపీ ప్రభుత్వం నందమూరి తారకరామారావు అని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ అన్నారు. సోమవారం గూడూరులోని సొసైటీలో ఆయన నూతనంగా పెంచిన పెన్షన్ నగదును సచివాలయ సిబ్బందితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ సూచనల మేరకు పెంచిన ఫించన్లను పంపిణీ చేశామన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పించన్లను ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు.ఎన్టీఆర్‌ హయాంలో నెలకు రూ. 35చొప్పున అందించగా తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే దానిని రూ.75కు పెంచారన్నారు. 2004 ఎన్నికల ప్రచారంలో పెన్షన్లను రూ.200 చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే రూ.25మాత్రమే పెంచారని గుర్తుచేశారు.
ఒకేదఫా చేస్తామని చెప్పలేదని దబాయిస్తూ ఏడాదికి రూ.25చొప్పున అంటూ నాడు వైఎస్ మోసం చేశారన్నారు. 2014 జూన్‌ 8న నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షన్లను రూ. 1,000కి పెంచారని, తరువాత రూ.1,000 నుంచి రూ.2వేలు చేశారన్నారు. ఐదేళ్లలో 10 రెట్లు పెంచి పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించారన్నారు.ఏకంగా రూ.1800 పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీకే సొంతం అన్నారు. 50 ఏళ్లు పైబడిన మత్స్యకారులకు, చేనేతలకు రూ.1000 పెన్షన్‌ ఇచ్చామన్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014 నాటికి 39,27,521 పెన్షన్లు ఉండగా 2019 మార్చి నాటికి 54.25 లక్షలకు పెంచామన్నారు. పెన్షన్లను రూ. 3వేలకు పెంచుతానని ఎన్నికల ప్రచార సమయంలో, వైసీపీ మేనిఫెస్టోలో, పాదయాత్రలో ప్రకటించి అధికారంలోకి వచ్చాక మాటతప్పి, ఏడాదికి రూ.250 చొప్పున పెంచుకుంటూ పోతామని ప్రమాణ స్వీకారం రోజు ప్రకటించి జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇచ్చిన తొలి మాటపై కూడా మడమ తిప్పారన్నారు. మళ్లీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే 1000 పెంచి, ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయితో కలిపి పింఛను మొత్తం రూ.7 వేలు అందించినట్లు తెలిపారు. వికలాంగుల పింఛను రూ.6 వేలు అందించామన్నారు. ఈ పింఛన్ పంపిణి కార్యక్రమంలో వార్డు సచివాలయ సిబ్బంది, వార్డు మాజీ కౌన్సిలర్ వీరుబోయిన వెంకటేశ్వర్లు, వార్డు ఉపాధ్యక్షులు గుడి మునీంద్రబాబు, మాజీ కౌన్సిలర్ వి. రఘురామయ్య, బియల్ఏలు మందపాటి చైతన్య, గునకల నరసయ్య, దేవుళ్ళ విజయ కుమార్, వేటూరు సురేష్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This