ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, పెన్నులు పంపిణీ*
*గూడూరు,
సీనియర్ పాత్రికేయుడు,బిసి నాయకులు ఉడతా శరత్ యాదవ్ జన్మదిన వేడుకలను గూడూరు రెండవ పట్టణం నరసింగరావు పేట లోని బాలసధనము నందు పిల్లల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పిల్లలకు పెన్నులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ది గూడూర్ ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్. జమాలుల్లా మాట్లాడుతూ అసోసియేషన్ లో సభ్యత్వం తుసుకున్న విలేకరుల జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల నిర్వహణ ఆనవాయితీగా వస్తోందన్నారు. అందులో భాగంగానే ఉడతా శరత్ యాదవ్ జన్మదిన వేడుకలను బలసధనము లోని పిల్లలు నడుమ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఐదుగురు విలేకరుల జన్మదిన వేడుకలను నిర్వహించామన్నారు, ఇకపై కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తామన్నారు. అసోసియేసన్
ఉపాధ్యక్షులు పరుచూరి బాలకృష్ణ మాట్లాడుతూ శరత్ యాదవ్ గత 20సంవత్సరాల నుండి విలేకరిగా కొనసాగుతున్నట్లు, అదేవిధంగా ప్రజా పోరాట,సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా విరివిగా పాల్గొంటుంటుంటారని తెలిపారు. శరత్ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను ఆధిరోహించాలని ఆకాంక్షించారు. ఉడతా శరత్ మాట్లాడుతూ పిల్లలు నడుమ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం శరత్ యాదవ్ చేతులమీదుగా పిల్లలకు పెన్నులు,పెన్సిల్ లు, కేక్, పఫ్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా అసోసియేషన్ సభ్యులు షేక్. జమాలుల్లా, ఉడతా శరత్ యాదవ్,పర్చూరు బాలకృష్ణ,వెంకటేస్వర్లు(టివి5), ప్రభుదాస్(10టీవీ),సలీం,పెద్ద సలీం,వెంకీ,ఆత్మకూరు సురేష్,తుళసిరాజు,సవరపు కిషోర్ కుమార్, చిట్టేటి నిరంజన్,బలసధనము వార్డెన్ అరుణ తదితరులు పాల్గొన్నారు.