తిరుపతిలోని 29వ వార్డు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కల్పన, వైస్ ప్రెసిడెంట్ జయంతి, లోకేష్, మంజునాథ్ లు కలిసి తిరుపతిలో జనసేన పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొందిన దానికి విశేష కృషి చేసి అధిష్టానం మాటకు తలవంచి ఆరని శ్రీనివాసులు గెలుపుకు కృషిచేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుల్లెట్ రమణ ని ఘనంగా సత్కరించారు. అనంతరం బుల్లెట్ రమణ మాట్లాడుతూ తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఏది చేసిన ఆలోచించి చేస్తారని ఎంతటి పద్మవ్యూహాన్ని అయినా జయించగల సమర్థవంతుడు అని, ఆయన పనితీరు చూసి ప్రజలు పట్టాభిషేకం చేశారుఅని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ కార్యకర్తలు పాల్గొన్నారు