Advertisements

గూడూరు నియోజక వర్గ పరిధిలోని మహిళా, విభిన్న ప్రతిభావంతుల, జనరల్ ఆదర్శ పోలింగ్ కేంద్రాల ఏర్పాటును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్

గూడూరు నియోజక వర్గ పరిధిలోని మహిళా, విభిన్న ప్రతిభావంతుల, జనరల్ ఆదర్శ పోలింగ్ కేంద్రాల ఏర్పాటును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్

గూడూరు నియోజక వర్గానికి కేటాయించబడిన పోలింగ్ సిబ్బంది మే 2న శిక్షణకు తప్పక హాజరు కావాలి

గూడూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఈవిఎం ఇంటర్మీడియేటరీ స్ట్రాంగ్ రూం ను, పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

గూడూరు, తిరుపతి జిల్లా, ఏప్రిల్28: సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో గూడూరు పట్టణంలోని ఆదర్శ మహిళా పోలింగ్ కేంద్రాన్ని, ఆదర్శ విభిన్న ప్రతిభావంతుల పోలింగ్ కేంద్రాన్ని, సాధారణ ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి తెలుపుతూ సజావుగా ఎన్నికల నిర్వహణకు పక్కా ప్రణాళికతో నిర్దేశిత టైం లైన్ మేరకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం గూడూరు పట్టణంలోని మునిసిపల్ కౌన్సిల్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన 53- ఆదర్శ మహిళా పోలింగ్ కేంద్రాన్ని పింక్ పోలింగ్ బూత్ ను, సిఎస్ఎంఓ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 39-సాధారణ ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని, సివిఎస్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల లో ఏర్పాటు చేసిన 45- ఆదర్శ విభిన్న ప్రతిభావంతుల పోలింగ్ కేంద్రాన్ని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నియోజక వర్గంలో పింక్ పోలింగ్ కేంద్రం మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్న కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం సంతోషం అని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపు, వీల్ చైర్స్, షేడ్, త్రాగు నీరు, ఓ ఆర్ ఎస్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది రెండవ దఫా ర్యాండమైజేషన్ డీఈఓ స్థాయిలో నేడు ఆది ఆదివారం ఉదయం పూర్తి అయిందని పోలింగ్ పార్టీ సిబ్బందికి మే2 న శిక్షణకు ఏర్పాట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలుపగా సిఎస్ఎంఓ ఉన్నత పాఠశాల నందు శిక్షణ ఇవ్వనున్నామని ఆర్డీఓ తెలిపారు. అంతే కాకుండా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు ఎన్నికలలో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల అభ్యర్థుల సమావేశం రేపు ఏప్రిల్ 29న నిర్వహించిన అనంతరం మాత్రమే ఈనెల 30 నుండి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను ఇంటింటికి సంబంధిత ఓటరుకు పంపిణీ చేయాల్సి ఉంటుందని, అనంతరం ఏఎస్డి లిస్టును పక్కాగా తయారు చేయాల్సి ఉంటుందని అన్నారు.

గూడూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ఈవిఎం ఇంటర్మీడియేటరీ స్ట్రాంగ్ రూం ను, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను, పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను పరిశీలించారు. ఈవిఎం కమిషనింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి రాజకీయ పార్టీల అభ్యర్థుల సమక్షంలో జరపాలని సూచించారు. జిల్లా కేంద్రం నుండి పంపిన ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు. చెక్ లిస్ట్ మేరకు సదరు మెటీరియల్ ఉండేలా సరి చూసుకోవాలని అన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, రెండంచెల భద్రత 24X7 ఉండాలని సూచించారు. అనంతరం గూడూరు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ గూడూరు వెంకటేశ్వర్లు, డిఎల్డిఓ వాణి, తాసిల్దార్లు కరుణ కుమార్, నరసింహా రావు, ఎంపిడిఓ రాజశేఖర్, పోలీస్ నోడల్ అధికారి పాపా రావు, సెక్టరల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This