అవ్వ ఎలా ఉన్నావు… ఆరోగ్యం ఎలా ఉంది. ముందు బిళ్ళలు టైంకి వేసుకుంటున్నావా…ఆరోగ్యం జాగ్రత్త
వైకాపాకు ఓటు వేయమని అభ్యర్థించడానికి వచ్చాం. మీరు అనారోగ్యంతో మంచం లో ఉన్నారా అయితే నేనే వస్తున్నా. వైద్యం అందుతుందా…!
ఇంటింటికి ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి తనయుడు రేవంత్ చక్రవర్తి
ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. తలపండిన నేతలా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి యువ నాయకుడుగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రచారంలో రోజురోజుకు ఓటర్లతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. గూడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరిగ మురళీధర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయన తరపున తనయుడు రేవంత్ చక్రవర్తి వైకాపా గెలుపుకు తన తండ్రికి మద్దతుగా ప్రచారాన్ని ప్రారంభించారు. పట్టణంలోని ఎనిమిది వార్డుల్లో ప్రచారాన్ని పూర్తి చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులతో పాటు స్థానిక నాయకులతో ప్రతి ఇంటికి వెళ్తూ ఓటర్లను వైకాపాకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. తన తండ్రి మెరిగ మురళీధర్ ను గెలిపించాలని కోరుతున్నారు. ఓటర్ల నుంచి కూడా సానుకూల స్పందన వస్తుంది. వైకాపా చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల్లో పాల్గొంటామని ఓటర్లు స్పష్టం చేస్తున్నారు