అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్ట్ కు నల్ల బ్యాడ్జీలు ధరించి, చేతులకు సంకెళ్లు కట్టుకొని వినూత్న నిరసన. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భాగస్వామ్యులైన సి.పి.ఐ,సి.పి.యం,కాంగ్రెస్ పార్టీలతో కలిసి స్థానిక తిరుపతి నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట, ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో అక్రమ అరెస్టులు నిరసనకు సంఘీభావంగా వినూత్న రీతిలో కళ్లకు నల్ల గుడ్డ కట్టుకొని చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తూ జైలు పాలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టు దేశవ్యాప్తంగా విపక్షాల ఐక్యత చాటుకున్నదని జరగనున్న సార్వత్రిక పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి చిత్తచిత్తుగా ఇండియా కూటమి చేతిలో ఓడిపోతుందని భయపడి బలమైన నిజాయితీ గల నాయకులను జైలుకు పంపడం సరికాదని తెలిపారు. తక్షణమే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ విడుదల చేయాలని ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు చేయాలని ఎన్నికల కమిషన్ను కోరారు .ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్, తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జి బొంతల రాజేష్ రాయల్ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట చలపతి, రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాలసుబ్రమణ్యం ,రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివాక చందు,సి.పి.ఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజ్, తిరుపతి నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, మాధవ కృష్ణ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పి.సి.సి ఉపాధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి ,రాష్ట్ర అధికార ప్రతినిధి మాoగాటి గోపాల్ రెడ్డి , రాష్ట్ర ఓబీసీ వర్కింగ్ చైర్మన్ డాక్టర్ మురళీమోహన్ యాదవ్ ,పి సిద్దయ్య తిరుపతి జిల్లా మీడియా కో ఆర్డినేటర్ చిన్నారావ్ గోపి గౌడ్ బీసీ సెల్ సెక్రెటరీ మరియు సి.పి. ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ. ఐ .టి యూ .సి జిల్లా అధ్యక్షులు చంద్ర శేఖర్ రెడ్డి,నగర కార్యదర్శి యన్.డి.రవి,సర్దార్ శివ ,అమ్ పార్టీ నాయకులు తిరుపతి నగర కార్యదర్శి నీలా విజయ్ భాస్కర్, శెట్టి పల్లి నరసింహులు, సూలూరు పేట నియోజకవర్గ ఇన్చార్జి పట్టపు రవి, గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి ఈ.శ్రావణ్ కుమార్,వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి యం.బి.రాజు,సత్యవేడు నియోజకవర్గ సోషియల్ మీడియా ఇన్చార్జి బి.సునీల్, శ్రీకాహస్తి నియోజకవర్గం రేణిగుంట మండల నాయకులు డాక్టర్ అహ్మద్ ,మహేష్ ,అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గ కన్వీనర్ రహీం భాష ,బి.సి.రాయలసీమ విద్యార్థి విభాగం అధ్యక్షుడు విజయ్ ఉత్తర్రాధి,గురు ,సి. వై.యస్.యస్.విద్యార్థి నాయకులు సురేష్ నాయక్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.