ముస్లింలకు మేలు జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే…..*
*మైనారిటీలంతా తెలుగుదేశం పార్టీ వైపే..*.
*గూడూరు నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు MD అబ్దుల్ రహీమ్ తెలుగుదేశం పార్టీ కార్యాల యం గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు ఎండి అబ్దుల్ రహీం అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అబ్దుల్ రహీం, తదితరులు మాట్లాడుతూ , ఉమ్మడి కూటమి తో రేపు ప్రజలలోకి వస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ గెలుస్తుందోనని, కూటమి అధికారంలోకొస్తే మైనారిటీ లకు అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు..BJP తో కలసి పనిచేస్తుందని ప్రభుత్వం ఇలా అసత్యపు మాటలు చెపుతుందని అన్నారు.గతంలో ముస్లిం లకు మేలు జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం హయంలోనేనని,మసీద్ లలో పనిచేసే ఇమామ్ లకు గౌరవ వేతనం అందించింది, TDP, షాది మంజిల్ లను ఏర్పాటు చేసింది,. పేద ముస్లిం ల పెళ్లిళ్లకు దుల్హర్ పథకం పెట్టి వారికి కానుక అందించిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లో చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేనని మైనారిటీలందరూ గుర్తుంచుకోవాలన్నారు.ముస్లిం లకు ఏదైనా మేలు జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం హయంలోనే అని అన్నారు.కావున ఈ రోజు ఈ ప్రభుత్వం ముస్లిం లను ఉమ్మడి కూటమి నుండి దూరం చేయాలని అసత్యపు ప్రచారాలు చేస్తుందన్నారు.మా ముస్లిం సోదరులు అందరికి ఏ ప్రభుత్వం మాకు న్యాయం చేసిందో , ఏ ప్రభుత్వం మాకు అండగా ఉండి రక్షణ కల్పించిందో బాగా తెలుసని, మీ కల్లబొల్లి మాటలు నమ్మే స్థితిలో ముస్లిం మైనార్టీలు లేరన్నారు. అబ్దుల్ సలాం కుటుంబాన్నివేదించి చనిపోయేట్లు చేసిన ప్రభుత్వం వైసీపీ అని తెలుగుదేశం హయాంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదని గతంలో హైదరాబాదు సిటీలో మతకల్లో లాగా జరిగేవని కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ మత కల్లోలాలను అణిచివేసి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ శాంతిని నెలకొల్పింది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనన్నారు.రేపు జరగబోయే ఎలక్షన్ లలో ఉమ్మడి కూటమి అభ్యర్థి వైపే మా ముస్లిం సోదరులు అందరూ ఉంటున్నామని, మాకు అండదండగా నిలిచిన తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని అలాగే ఈ నియోజకవర్గంలో ముస్లిం సోదరులను సొంత సోదరులుగా ఆదరించి మా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పాశం సునీల్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంల నాజారుద్దిన్, పట్టణ మైనారిటీ అద్యక్షులు SK అలీ హుస్సేన్,ఔరంగ్ బాష, జహంగీర్, ,అబ్దుల్ రూబ్,అల్తాఫ్,జిలాని బాష సిరాజ్,మోబినుద్దిన్,నయీమ్,, హారూన్ రషీద్, ఫక్రుద్దీన్, సయ్యద్, సలాం ,కరీముల్లా, మస్తాన్ ,ఆసిఫ్,ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.