తిరుపతి జిల్లా గూడూరు పట్టణములోని
టీడీపీ కార్యలయం లో తెలుగు మహిళలు ప్రెస్మీట్ నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు చక్రాల ఉష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మీడియా తో మాట్లాడుతూ .
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు కు సరికొత్త పథకాన్ని టీడీపి ప్రభుత్వం తీసుకురావాలని నిర్ణయించిందని, రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ‘కలలకు రెక్కలు’ పేరుతో కొత్త పథకాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రవేశ పెట్టున్నారని తెల్పారు.
ఈ పథకానికి ఇంటర్ చదివిన విద్యార్థులు, మహిళలను అర్హులని తెలియజేసారు..
ఈ పథకం కింద అర్హులకు బ్యాంకు లోన్ ఇప్పించనుందిని. ఈ లోన్‌కు బ్యాంకు వడ్డీ కట్టే బాధ్యతను టీడీపీ, జనసేన పార్టీ బాధ్యత తీసుకోనుందని తెల్పారు.
మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటర్ విద్యార్థినులకు ,చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ శుభ వార్త తెలిపారని ఇది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చూసించారు.
ఇంటర్ పూర్తి చేసుకుని ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకునే విద్యార్థులకు ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంక్ లోన్ ఇప్పించననున్నట్లు తెలిపారు.
విద్యార్థినులు చెల్లించాల్సిన బ్యాంకు వడ్డీని పూర్తి టీడీపీ-జనసేన ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి గుండాల లీలావతి యాదవ్, పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం.శ్రావణి రెడ్డి, తదితరులు తెలుగు మహిళలు పాల్గొన్నారు.