Advertisements

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం

మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్

యువతను పెడదోవ పట్టించిన ఘనత జగన్ దే

పరిశ్రమలతో యువతకు ఉపాధి కల్పిస్తాం

వలస ఎమ్మెల్యే ఆభ్యర్థులను ప్రోత్సహించొద్దు

వాలంటీర్లకు నెలకు రూ. పదివేలు జీతం

మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ వెల్లడి

గూడూరులో 2వేల మందితో భారీ ర్యాలీ

500 మంది యువత టీడీపీలో చేరిక

గూడూరు : వైసీపీ అసమర్థ, అరాచక పాలనతో రాష్ట్రం సర్వ నాశనమైందని మాజీ ఎమ్మెల్యే, గూడూరు నియోజకవర్గ టీడీపీ-జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ధ్వజమెత్తారు. బుధవారం గూడూరు పట్టణంలో 2వేల మంది టీడీపీ-జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో టవర్ క్లాక్ సెంటర్ నుండి టీడీపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కటకరాజా వీధిలో జహాంగీర్, నాలి మధుసూదన్ యాదవ్, బత్తిన ప్రణీత్ యాదవ్, మువ్వా చరణ్ మిత్రబృందం ఆధ్వర్యంలో క్రేన్ తో భారీ గజమాలను వేసి మాజీ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ వాహనంలో మాజీ ఎమ్మెల్యే ర్యాలీలో పాల్గొన్నారు. నాయకులందరూ కలిసి గమళ్లపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో పట్టణాధ్యక్షులు పులిమి శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ మాట్లాడారు. ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. మళ్లీ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించాలంటే చంద్రబాబును సీఎం చేసుకోవాలన్నారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే పరిస్థితుల్లో పవన్ మద్దతు మరువలేనిదని జనసైనికుల కరతాళ ధ్వనుల నడుమ అన్నారు. గూడూరు నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. బీసీలకు 50 ఎళ్లకే పింఛన్ వసతి కల్పిస్తామని ప్రకటించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వస్తే పదివేలు జీతం ఇస్తామని వాలంటీర్లకు హామీ ఇస్తున్నామన్నారు.
వాలంటీర్ వ్యవస్థను తొలగించే పరిస్థితి లేదన్నారు. ఎన్నికలలో అత్యుత్సాహం ప్రదర్శించవద్దని కోరారు. వాలంటీర్లను సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తామన్నారు. ఎన్నికల్లో తటస్థ వైఖరితో ఉండాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమన్నారు. ఆరిపోయిన వీధి లైట్లు కూడా వెలిగించే పరిస్థితి లేదన్నారు. అభివృద్ధి కేవలం టీడీపీ ప్రభుత్వంలో జరిగిందన్నారు. యువతను పెడదోవ పట్టించిన ఘనత వైసీకే దక్కిందన్నారు. ఈసారి ఏర్పడే ప్రభుత్వానికి యువత మద్దతు అవసరన్నారు. వలస ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రోత్సహించొద్దని యువతను కోరారు. నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. నియోజకవర్గ పరిధిలో 9 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అందించామని గుర్తు చేశారు. తనను కుటుంబ సభ్యుడిగా భావించాలని కోరారు. ఆపదలో, కష్టాల్లో మీకు వెన్నంటి ఉంటానన్నారు. అలాగే సుఖం లోనూతోడుంటానన్నారు. నియోజకవర్గ ప్రజలు సునీల్ ఒక కుటుంబ సభ్యుడిగా భావించాలని కోరారు. సచివాలయాలను సైతం తాకట్టు పెట్టిన ఘనత జగన్ దేనన్నారు. పుట్టబోయే బిడ్డపై కూడా రూ. 3.5 లక్షలు అప్పు ఉండేలా ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చంద్రబాబు ప్రవేశ పెట్టిన విదేశీ విద్య రుణ సౌకర్యాన్ని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, కుటుంబంలో అందరికీ అమ్మ ఒడి, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు విరివిగా రుణాలు, పెళ్లి కానుక, వీదేశీ విద్య రుణాలు, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తదితర పథకాలను అందిస్తామని తెలిపారు.ర్యాలీ, చేరికలకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన షేక్. జహాంగీర్, నాలి మధుసూదన్ యాదవ్, బత్తిన ప్రణీత్ యాదవ్, మువ్వా చరణ్ లకు, వారి మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. గూడూరు నియోజకవర్గ పరిశీలకులు షేక్ కరీముల్లా మాట్లాడుతూ యువతకు ప్రపంచాన్ని తలకిందులు చేసే శక్తి ఉందన్నారు. సమయం తక్కువ ఉందని, విలువైన సమయం, శక్తిని సునీలన్న గెలుపే లక్ష్యంగా ఉపయోగించాలన్నారు. లక్ష ఓట్ల మెజారితో గెలిపించి అమరావతికి పంపించాలన్నారు. యుద్ధమే శరణ్యమన్నారు. సైనికుల్లా పనిచేయాలన్నారు. టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ నాయకులు, టీడీపీ తిరుపతి పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులుశ్రీపతి బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరాచకాలతో యువత ఆశలు నిర్వీర్యం అయ్యాయన్నారు. నిరుద్యోగ సమస్య అధికమైందన్నారు. దీంతో యువత తండోపతండాలుగా టీడీపీకి తరలివస్తున్నారన్నారు. కుటుంబాలు బాగుండాలన్నా, గ్రామాలు బాగుపడాలన్నా చంద్రబాబును సీఎం చేసుకోవాలన్నారు. గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి సునీల్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుని మంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.500 మంది యువత టీడీపీలో చేరిక
గూడూరు పట్టణంలోని గమళ్లపాలెం టీడీపీ కార్యాలయంలో బుధవారం షేక్. జహాంగీర్, నాలి మధుసూధన్ యాదవ్, మువ్వా చరణ్, బత్తిన ప్రణీత్ యాదవ్ ల ఆధ్వర్యంలో 500 మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ పసుపులేటి సిద్ధయ్య నాయుడు తోపాటు గూడూరు, చిల్లకూరు మండలాల నుండి సుమారు 500 మంది యువత టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పార్టీలో చేరిన యువతకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షులుపులిమి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, మైనారిటీ నాయకులు షేక్. జహాంగీర్, ప్రణీత్ యాదవ్, మధుసూదన్ యాదవ్, వెంకటేశ్వర్లు, చరణ్, ఆర్ఎస్కే సద్దాం హుస్సేన్, శివ ప్రసాద్ గౌడ్, వేముల సునీల్, రావూరు సురేంద్ర, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు హసనాపురం వెంకటేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This