Advertisements

నువ్వు లోకలో నేను లోకలో రేపు ప్రజాక్షేత్రంలో ప్రజలు తెలుస్తారు.

తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో టిడిపి  కార్యాలయంలో మాజీ శాసన సభ్యులు & నియోజకవర్గ అభ్యర్థి పాశిం సునీల్ కుమార్ఆధ్వర్యంలోనియోజకవర్గం నాయకులు కార్యకర్తలతో పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ
రేపు 7 వ తేదీన నియోజకవర్గంలో జరిగే శంఖారావం కార్యక్రమం ను జయప్రదం చేయాలని  కోరారు .అలాగే టీడీపి పార్టీ లో బాబు  ప్రవేశ పేట్టబోయే సూపర్ 6 పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని  నాయకులు కి చూసించారు.కొందరు నేను లోకల్ కాదు అని మాట్లాడటం విడ్డురం గా ఉంది అన్నారు. పోటీచేయాలి అనుకున్నపుడు చేసే విమర్శలలో నిజాలు అయుండాలి, ఏది పడితే అది మాట్లాడకూడదని హితవుపలికారు. నీవు లోకాల్ నేను లోకల్ అనేది రేపు జరిగే ఎన్నికలో ప్రజలు తీర్పు ఇస్తారు అన్నారు.  బాబు ప్రకటించిన మొదటి లిస్ట్ లో నా పేరు వచ్చింది అంటే అది మీ అందరి సహకారమే అని పార్టీ నాయకులు ధన్యవాదాలు  తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు శీలం కిరణ్ కుమార్, నెలబల్లి భాస్కర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, కొండూరు వెంకటేశ్వర్లు రాజు,మద్దాలి సర్వోత్తమ రెడ్డి,కిషోర్ నాయుడు జిల్లా కమిటీ సభ్యులు, మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…

Leave a Comment

You May Like This