Advertisements

వాలంటీర్‌ సౌజన్య సేవలు అభినందనీయం

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ వద్దకే వెళ్లి

ధైర్యం చెప్పి పింఛను అందించిన గూడూరు వార్డు వాలంటీర్ సౌజన్య

తిరుపతి జిల్లా గూడూరు తిలక్ నగర్ కు చెందిన కందిపాటి హేమలత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నెలనెల వితంతు పింఛను పొందుతోంది.హేమలత ఇటీవల అనారోగ్యం బారినపడి నెల్లూరు సిటీ పరిధిలోని నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో గుండె సంబంధిత ఆపరేషన్ చేయించుకుని వైద్యం పొందుతుంది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెల పింఛను మొత్తాన్ని అందించేందుకు వాలంటీర్ సౌజన్య లబ్ధిదారుదారుని ఇంటికి వెళ్లగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు.ఫోను ద్వారా వివరములు తెలుసుకుని నెల్లూరులో చికిత్స పొందుతున్న బాధితురాలి వద్దకు వెళ్లి పింఛను మొత్తం రూ:3000/- అందించి దైర్యం చెప్పి రావడం జరిగింది.వాలంటీర్ సౌజన్య కు హేమలత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సౌజన్య సేవలకు వార్డు ప్రజలు అభినందనలు తెలిపారు.

Leave a Comment