????మల్లాం లో చరిత్ర కలిగిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ స్వయంభువు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం
????ఆలయంకు పోటెత్తుతున్న భక్తులు
????భక్తులు కోసం అన్న ప్రసాద భవన నిర్మాణం కు శ్రీకారం
????దువ్వూరు శేషు రెడ్డి తండ్రి క్రీ”శే దువ్వూరు హనుమంత రామారెడ్డి జ్ఞాపకార్థంతో అన్నదాన ప్రసాద భవనం నిర్మాణం పూర్తి
????ఆదివారం అన్నదాన ప్రసాద భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం
????ముఖ్య అతిధులు గా పాల్గున్న టిటిడి బోర్డు మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఆర్డివో కిరణ్ కుమార్
????సూళ్లూరుపేట శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య, తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షులు రాంకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు మేరిగ మురళి
????బల్లి శ్వేతా , ఎన్ డి సి సి బ్యాంక్ జిల్లా చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ప్రముఖులు
????అతిధులకు అపూర్వ స్వాగతం పలికిన దువ్వూరు శేషు రెడ్డి, చిల్లకూరు సాయి కుమార్ రెడ్డి
????అన్నదాన ప్రసాద భవనం ప్రారంభోత్సవం కు తరలివచ్చిన వేలాది మంది ప్రజలు, భక్తులు
????అన్నదాన ప్రసాద భవనంను ప్రారంభించిన టిటిడి బోర్డు మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి
????సభలో టిటిడి బోర్డు మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి నీ
సన్మానించిన దేవస్థానం కమిటీ
????సభ లో మాట్లాడిన గూడూరు ఆర్డివో కిరణ్ కుమార్
????ఆధ్యాత్మిక పై సుధీర్గంగా ప్రసంగించిన ఆర్డివో
????ఆర్డివో ప్రసంగం కు మంత్రముగ్ధుడు అయినా వై వి సుబ్బారెడ్డి
????ఆధ్యాత్మిక పై ఇంత పట్టుందా అంటూ ఆర్డివో ను అభినందించిన వై వి సుబ్బారెడ్డి
????టిటిడి కి మీ సేవలు ఎంతో అవసరం అంటూ ఆర్డివో మెచ్చుకొన్న వై వి సుబ్బారెడ్డి
????ఆర్డివో ను సన్మానించిన దేవస్థానం కమిటీ
????శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ స్వయంభువు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి కి మీరు చేసిన చరిత్ర లో నిలిచి ఉంటాయి ఆర్డివో గారు
????ఆర్డివో గారు మీ సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు :ఆలయ కమిటీ
????దువ్వూరు సోదరుల సేవలు అమోఘం :వై వి సుబ్బారెడ్డి
తిరుపతి జిల్లా,చిట్టమూరు మండలం, మ ల్లాం గ్రామంలో 700సంవత్సరాల చరిత్రకలిగినఅతిపురాతనమైన
శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ స్వయంభువు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దిన దిన అభివృద్ధి జరుగుతుంది.ప్రతీ ఏటా బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవం గా నిర్వహిస్తారు. దేవస్థానం ముందర పరిసర ప్రాంతాలను కొంతమంది ఆక్రమణలు చేసుకొని దుకాణాలు కట్టి మద్యం, కల్లు దుకాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారం సాగిస్తుండగా మందు బాబులు ఆగడాలు ఎక్కువ కావడం తో ఆలయం కు వచ్చే భక్తులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు, ఇలాంటి పరిస్థుల్లో ఆర్డివో కిరణ్ కుమార్ పుణ్యమా అనీ ఆక్రమణలు తొలగించడం తో ఇటీవల జరిగిన బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయి.
పురాతన మైన ఆలయం కావడం తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రల నుండి భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో భక్తులను నిత్య అన్నదానం చేయాలనీ వైసీపీ నేత దువ్వూరు శేషు రెడ్డి,దేవస్థానం కమిటీ చైర్మన్ చిల్లకూరు సాయికుమార్ రెడ్డి లు చర్చించుకొని అన్న ప్రసాద భవనం ఏర్పాటు కు శ్రీకారం చుట్టారు. దువ్వూరు శేషురెడ్డి ముందుకు వచ్చి ఆయన తండ్రి స్వర్గీయ దువ్వూరు హనుమంత రామారెడ్డి జ్ఞాపకార్థంతో అన్నదాన ప్రసాద భవనంను నిర్మించారు.
ఆదివారం అన్నదాన ప్రసాద భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రారంభోత్స వ కార్యక్రమంకు టిటిడి బోర్డు మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షులు నేదురు మల్లి రాం కుమార్ రెడ్డి,తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దెల గురుమూర్తి,, సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీలు మేరిగ మురళి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి సతీమణి డాక్టర్ శ్వేత , ఎన్ డి సి సి బ్యాంక్ జిల్లా చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి లు హాజరు అయ్యారు.
వీరికి దేవస్థానం ఈ ఓ శశాంక్, వైసీపీ నేత దువ్వూరు శేషు రెడ్డి,శ్రీ శ్రీ శ్రీ వల్లీదేవసేనసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ చిల్లకూరు సాయి రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శాలువా కప్పి పుష్ప గుచ్చం అందజేశారు.అనంతరం అన్న ప్రసాద భవనం ను వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభ కు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సభ లో పాల్గున్న ముఖ్య అతిధు లు వైవీ సుబ్బారెడ్డి, ఆర్డివో కిరణ్ కుమార్ లను దేవస్థానం కమిటీ ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ స్వయంభువు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో చరిత్ర కలిగి ఉండటం సుమారు 700సంవత్సరాల క్రితం చోళ, పాండ్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించి ఎంతో అభివృద్ధి చేశారు అనీ తెలిపారు, ఇక్కడ ఆధ్యాత్మిక కళ ఉట్టి పడుతుందిఅన్నారు.
ఇంతటి ఘన చరిత్ర ఉన్న దేవస్థానం లో భక్తులు కోసం అన్న ప్రసాద ప్రసాదం భవనం నిర్మించి ప్రారంభోత్సవ కార్యక్రమం కు తనను ఆహ్వానించడం నా పూర్వ జన్మ సుకృతం అన్నారు. ఈ ఆలయ అభివృద్ధి కి నా వంతు సహాయ సహకారం అందిస్తాను అనీ చెప్పారు. ఇక్కడ ప్రజలు చూపిన ప్రేమ ఆప్యాయత ఎన్నటికీ మరువలేనిది అనీ అన్నారు.
దువ్వూరు సోదరుల సేవలు అమోఘం :వై వి సుబ్బారెడ్డి
మాకు ఆత్మీయులు అయిన దువ్వూరు శేషు రెడ్డి, దువ్వూరు రామలింగారెడ్డి, దువ్వూరు రామ రాఘవ రెడ్డి లు చేస్తున్నా సేవలు అమోఘం, స్ఫూర్తి దాయకం అనీ మాజీ టి టి డి బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. నా ప్రాణ స్నేహితులు దువ్వూరు రామలింగారెడ్డి అనీ చెప్పారు. ఎంతో చరిత్ర కలిగిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ స్వయంభువు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంకు వచ్చే భక్తులకు ఆకలి తీర్చేందుకు అన్న ప్రసాదం భవనం ను వారి తండ్రి స్వర్గీయ దువ్వూరు దువ్వూరు హనుమంత్ రామారెడ్డి జ్ఞాపకార్ధంతో నిర్మించడం చాలా గొప్ప కార్యక్రమం అన్నారు.అన్న ప్రసాదం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంకు తనను ఆహ్వానించి సత్కరించిన వారి ఆత్మీయత ను మరువలేనిది అనీ దువ్వూరు సోదరలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్డివో కిరణ్ కుమార్ మంచి అధికారి :వై వి సుబ్బారెడ్డి
గూడూరు ఆర్డివో కిరణ్ కుమార్ మంచి అధికారి ఆయన చేసిన సేవలు గురుంచి ఇక్కడ ప్రజలు చెబుతూ ఉంటే ఆయన నిబద్దత అర్ధం అవుతుంది అనీ అన్నారు. స్టేజి పై ఆర్డివో ఆధ్యాత్మిక పై మాట్లాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆధ్యాత్మికత పై ఇంత పట్టు ఉండటం గొప్ప విషయం అన్నారు. ఆర్డివో సేవలు టిటిడి కి ఉపయోగ పడేలా కృషి చేస్తాను అనీ ఆయన తెలిపారు.
ఆర్డివో కిరణ్ కుమార్ సేవలు అపూర్వం :దువ్వూరు శేషు రెడ్డి
శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ స్వయంభువు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో చరిత్ర కల్గి ఉండటంతో చాలా రాష్ట్రల నుండి భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం చుట్టూ చాలా ఆక్రమణలు చేసుకొని మద్యం బెల్ట్ షాప్ లు, కల్లు దుకాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారం సాగించడం తో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతే కాకుండా బ్రమోత్సవాలు జరిగేటప్పుడు రధం పురవిధుల్లో తిరగాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ఈ సమస్యలు ఆర్డివో దృష్టికి తీసుకెళ్లడం తో ఆయన స్పందించి ఆక్రమణలు తొలగించి ఆలయ అభివృద్ధి కి ఎంతో సహకరించారు అనీ ఆయన సేవలు చరిత్ర లో నిలిచి ఉంటాయి అనీ తెలిపారు.ఈ కార్యక్రమం లో దేవస్థానం కమిటీ సభ్యులు,వైసీపీ నాయుకులు, కార్యకర్తలు, భక్తులు, ప్రజలు పాల్గున్నారు.