Advertisements

*CSI చర్చి లో దారుణం, చర్చి లోపలే దాడి*

గంగాధర్ నెల్లూరు మండలంలో గంగాధర నెల్లూరు CSI చర్చి 1919 సంవత్సరాలనుండి జరుపబడుతున్నది. చర్చిలో సుబమనీయం పదవీకాలం ముగియడంతో కొత్తగా సభమనియం కొరకు తరతరాల నుండి దేవుని సేవ చేస్తున్న స్వామినాథన్ కుమారుడు జాన్ పోటీ చేయగా, చిత్తూరు DCC సొసైటీ బ్యాంక్ మేనేజర్ R. రఘబాబు అతని అల్లుడికి కావలసినదిగా కోరడమైనది.ఊరికి అల్లుడుగా ఉన్న వ్యక్తికి ఎలా ఇవ్వగలం అని జాన్ ప్రశ్నించగా బ్యాంకు మేనేజర్ రఘుబాబు మరియు తెలుగుదేశం కార్యకర్త శివ లు కలిసి వారి అనుచరులతో చర్చిలోపలే  దాడులకు దిగి భయభ్రాంతులకు గురి చేశారు.
అడ్డొచ్చిన  కుటుంబ సభ్యులను స్త్రీలను విచక్షణ రహితంగా మద్యం మత్తులో  దాడి చేశారు.  అంతకుముందు సుమారు 30 మందితో జాన్ ఇంటి దగ్గరకు వెళ్లి    వార్నింగ్ ఇచ్చారు.రఘు బాబు ఇదివరకే  స్థానిక వేల్కూరులోని CSI చర్చిని కూడా ఇదేవిధంగా  అనుచరులతో దాడులకు దిగి  2 సంవత్సరములు మూసి వేయడం జరిగినది.తన బ్యాంక్ ఉద్యోగం అడ్డం పెట్టుకొని ప్రతి చర్చిలోనూ వసూళ్లకు  పాల్పడేవాడు, అడిగినవారిని అనుచరులతో దాడికి దిగుతారు.  దీనికి ఊరు పెద్ద మనుషులైనటువంటి సుబ్రహ్మణ్యం, రామచంద్ర, సతీష్, లు సహకరిస్తారు.ఏసు, సింసన్, గిరి,  గుణ, ధన శేఖర్ మరియు వారి అనుచరులు మద్యం సేవించి స్త్రీలపై దాడులు చేశారు.

Leave a Comment