Advertisements

వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు జనం సిద్ధం గా ఉన్నారు.- టీడీపీ.

తిరుపతి జిల్లా గూడూరు పట్టణ టీడీపీ కార్యాలయంలో మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్  సూచనల మేరకు. విలేకరుల సమావేశం నిర్వహించారు.
మీడియాతో మాట్లాడుతూ…
రాష్ట్రంలో జరుగుతున్న ఆరాచక పాలన పై నిరసనగా…ఈ ప్రభుత్వాన్ని ఓడించేందుకు జనం సిద్ధం గా ఉన్నారని అన్నారు.ప్రభుత్వానికి  కౌంట్ డౌన్ మొదలైందని ఇక మిగిలింది 74 రోజులు మాత్రమే వైఎస్ఆరిసీపీ దురాగతాలకు ప్రజాకోర్టులో శిక్షపడే సమయం ఆసన్నమైందని అన్నారుఈ ప్రభుత్వ అహంకారానికి, వైఎస్సార్సీపీ అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు రైతులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు అంతా సిద్ధమయ్యారు.ఈ కురుక్షేత్ర ధర్మ యుద్ధంలో టీడీపీ-జనసేనలు గెలుస్తాయి.గత ఐదేళ్లలో ప్రభుత్వం కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని గుర్తుచేసారు.టీడీపీ అధికారంలో ఉంటే సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి అన్నారుటీడీపీ హయాంలో లేని ఈ అప్పులు, కష్టాలు ఇప్పుడెందుకు వచ్చాయో ప్రజలు ఆలోచించాలి.ధరలు పెంచి ప్రజల రక్తాన్ని జలగలా పీల్చేస్తున్నాడు  మద్యం, నిత్యావసర వస్తువుల ధరలు, ఆర్టీసీ బస్సుల ఛార్జీలనుపెంచుతూ ప్రజలను దోచుకుంటోంది ఈ వైకాపా ప్రభుత్వం.ఈ నాయకుడు అభ్యర్థుల సీట్లు ప్రకటిస్తుంటే… అభ్యర్థులు మాత్రం వైసీపీని వదిలిపెట్టిపోతున్నారు.ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు వైసీపీని వదిలి పెట్టి వెళ్లారన్నారు.రానున్న ఎన్నికల్లో ఈ వైకాపా ప్రభుత్వాన్ని బంగాళఖాతంలో కలపడం ఖాయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అద్యక్షులు పులిమి శ్రీనివాసరావు,జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య,పట్టణ కమిటీ కోశాధికారి తక్కిల్ల పాటి చంద్ర మౌళి,పట్టణ BC సెల్ అద్యక్షులు రావుల శివప్రసాద్ గౌడ్, యువత షాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment