Advertisements

పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం. శ్రావణి రెడ్డి ఆధ్వర్యంలో చేనేత కార్మికులతో సమావేశం

చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్రలో భాగంగా ఈ రోజు చెన్నూరు గ్రామంలో కోటవీది నందు పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం. శ్రావణి రెడ్డి ఆధ్వర్యంలో చేనేత కార్మికులతో సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TNTUC రాష్ట్ర అధ్యక్షులు గొట్టికాయల.రఘురామరాజు గారు మరియు రాష్ట్ర TNTUC సభ్యులు పాల్గొని కార్మిక సమస్యలు తెలుసుకోవడం జరిగింది.మట్టం.శ్రావణి రెడ్డి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాశిం.సునీల్ కుమార్ గారి ద్వారా కేవలం చెన్నూరు గ్రామానికి 1,78,00,000 రూపాయలు తీసుకుని వచ్చి ట్రైనింగ్ సెంటర్ ల ద్వారా శిక్షణ ఇప్పించడం జరిగింది.కానీ ఈ ప్రభుత్వం రాగానే ఆ శిక్షణలు ఆపివేసినారు.అదే విధంగా చేనేత పింఛను తొలిగా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ,అలాగే నేతన్న నేస్తం పథకాన్ని GO ని పాస్ చేసింది చంద్రబాబు నాయుడు అని,అలాగే హెల్త్ కార్డ్ లు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చేవి.ఇప్పుడు అవి కూడా ఆపేసిన పరిస్థితి అని,అలాగే చేనేతకు 200 యూనిట్లు వరకు కరెంట్ ఉచితంగా ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.కానీ ఒక్క అవకాశం అని అందరూ మోసపోయారని వాపోయారు.మన పిల్లలు భవిష్యత్తుకు బాబు గారు మాత్రమే గ్యారంటీ ఇవ్వగలరు అని కాబట్టి మన గూడూరు అభివృద్ధి చెందాలంటే శాసనసభ్యులు గా పాశిo.సునీల్ కుమార్ ని గెలిపించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి.భాస్కర్ రెడ్డి,పార్లమెంట్ అధికార ప్రతినిధి బిల్లు.చేంచురామయ్య,TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబూరి.సిందూజ,పార్లమెంట్ అధ్యక్షులు జయరామిరెడ్డి,మండల ఉపాధ్యక్షులు పడాల.రత్నయ్య,కటీకాల.శ్రీనివాసులు, నియోజకవర్గ అధ్యక్షులు చెంగల్ రావు,నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ రహీమ్,బాలాజీ,మధిర.రాజనాల స్థానిక నాయకులు,చేనేత కార్మికులు పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This