గూడూరు : వైసీపీకి పొత్తులు అవసరం లేదని, రాష్ట్ర ప్రజలే వైసీపీకి పొత్తులని ఆ పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎండీ. మగ్ధూమ్ మొహిద్దీన్ అన్నారు. గురువారం గూడూరు పట్టణంలోని దర్గావీధిలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మగ్ధూమ్ మాట్లాడుతూ ప్రతిపక్షాలన్నీ ఏకమై వచ్చినా జగన్ మోహన్ రెడ్డి వెంట ప్రజలు ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, అసత్య ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ప్రజలు ప్రతిపక్షాల గురించి మీ పొత్తుల గురించి బాగా అర్థం చేసుకున్నారని, కేవలం టీడీపీ నాయకులు లాభాపేక్ష కోసం పని చేస్తున్నారని, జగనన్న ఒక్కడే ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారన్నారు. అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకు పోతున్నారని తెలిపారు. అలాగే ప్రతి పేద వాడి పిల్లల చదువుకు, వైద్యానికి పెద్ద పీట వేస్తూ రైతుల, మహిళల కష్టాలను దూరం చేస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. గూడూరు నియోజకవర్గంలోనూ గతంలో వైసీపీ సాధించిన ఓట్ల కంటే రెండింతలు మెజారిటీతో మేరిగ మురళీధర్ గెలవడం ఖాయమన్నారు. గూడూరు పట్టణ మైనారిటీ అధ్యక్షుడు జహీర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం చేసిన ఏకైక నాయకుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. 175 సీట్లకు 175 సాధించి జగన్ మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మగ్ధుమ్, మైనారిటీ పట్టణ అధ్యక్షుడు జహీర్, యువత అధ్యక్షుడు బాబు, కార్యదర్శులు యస్దాన్, జమీర్, షాకిర్ తదితరులు పాల్గొన్నారు.