Advertisements

త్రాగి వాహనాలు నడపడం నేరం- ట్రాఫిక్ నియమాలు పాటించండి:


తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి
రహదారి భద్రతకు చెందిన కరపత్రాలను
గోడపత్రిక బ్యానర్ లను విడుదల చేసినజిల్లా కలెక్టర్

త్రాగి వాహనాలు నడపరాదని అది వారి ప్రాణానికే కాదు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం అని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని అది వారి ప్రాణాలకు రక్షణగా ఉంటుందని అన్నారు. ఈ నెల జనవరి 20 నుండి ఫిబ్రవరి19 వరకు 35వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు 2024 నేపథ్యంలో శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు రహదారి భద్రత పై కరపత్రాలు, గోడపత్రిక, బ్యానర్ లను కలెక్టర్ డిటిసి గా పదోన్నతి పొందిన సీతారామి రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ రెడ్డి మరియు సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్రాగి వాహనాలు నడపరాదని అది వారి ప్రాణానికే కాదు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం అని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని అది వారి ప్రాణాలకు రక్షణగా ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలని, రహదారి ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి సకాలంలో తరలించి వారి ప్రాణాలను కాపాడాలని, ఇందులో భయపడాల్సిన పని లేదని తెలిపారు.

Leave a Comment

You May Like This