జిల్లా రవాణా శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు చేపట్టిన ఆర్టిఓ గూడూరు ఆదినారాయణ
సీతా రామిరెడ్డికి ఉప రవాణా అధికారిగా పదోన్నతి
జిల్లా రవాణా శాఖ అధికారి సీతా రామిరెడ్డికి ఉప రవాణా అధికారిగా పదోన్నతి పొంది విజయవాడ ప్రధాన కార్యాలయంలో పోస్టింగ్ నేపథ్యంలో వారు నేటి శనివారం జిల్లా రవాణా అధికారి తిరుపతి బాధ్యతలను గూడూరు ఆర్టిఓ ఆదినారాయణ రెడ్డి కి అప్పగించి విధుల నుండి విడుదల అయ్యారు. ఆది నారాయణ రెడ్డి గూడూరు ఆర్టిఓ బాధ్యతలతో పాటు జిల్లా రవాణా శాఖ అధికారిగా అదనపు బాధ్యతలో కొనసాగనున్నారు.