Advertisements

గూడూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థి మేరీగా మురళీధర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం-నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి

గూడూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థి మేరీగా మురళీధర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం-నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి

గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్తగా మేరిగా మురళీధర్ ను అధిష్టానం నియమించిందని, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి మేరిగా మురళీధర్ అని, ఆయన్ని రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తిరుపతి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీలో కష్టానికి తగ్గ ప్రతిఫలం కచ్చితంగా ఉంటుందని, కష్టపడిన కార్యకర్తలని అధిష్టానం గుర్తిస్తుందని, అందుకు నిదర్శనమే నేడు మేరిగా మురళీధర్ ను గూడూరు అభ్యర్థిగా నియమించడం జరిగిందని తెలిపారు. మేరీగా మురళీధర్ ను వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే తెలుగుదేశం పార్టీ ఇంకా బలమైన అభ్యర్థిని నియమించాలన్నా ఆలోచనలో పడిందని, ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థిని వెతికే పనిలో ఉందని, ఎటువంటి అభ్యర్థి ని తెలుగుదేశం పార్టీ నిలిపిన గెలుపు వైయస్ఆర్సీపీ దేనని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు రాబోయే రెండున్నర నెలలు కష్టపడి పనిచేసి గూడూరు నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుక ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సిపి గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరీగా మురళీధర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోనే రెండు పెద్ద కుటుంబాల అండదండలతో మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తల సహకారంతో నన్ను అనేక సర్వేలో ముందుంచి గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఎన్నుకునే విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టినప్పుడు నుంచి క్రమశిక్షణతో పార్టీలో ఎటువంటి బాధ్యత ఇచ్చిన నిర్వర్తించడమే నా పనిగా పెట్టుకొని స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు దోహదపడ్డారని దానికి తోడు ప్రభుత్వ విప్ పదవి కూడా ఇవ్వడం జరిగిందని అన్నింటికీ మించి గూడూరు నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా వైఎస్ఆర్సిపి సమన్వయకర్తగా నియమించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ కోసం నిరంతరం కష్టపడి అందరితో సమన్వయంతో పనిచేసి గూడూరు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలస్తానని ఆశాభవం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లు విజయ్ కుమార్ రెడ్డి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి నేదురుమల్లి భక్తవత్సల రెడ్డి సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి పోనక దేవసేనమ్మ నాసిన నాగులు బొమ్మిడి శ్రీనివాసులు మీరా రెడ్డి బాబు రెడ్డి బత్తిన విజయ్ కుమార్ ఎంపీపీ గురవయ్య ఉప ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి కొండూరు సునీల్ రెడ్డి కొడవలూరు ధనంజయ రెడ్డి వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This