Advertisements

కష్టకాలంలో..నాకు అండగా నిలిచిన వారికీ ఎల్లప్పుడూ అండగా ఉంటా…

???? గూడూరు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్……

????అన్నీ వర్గాల ప్రజలకు ఆత్మీయుడను -అందరికి అందుబాటులో ఉంటా…

????కోటలో గూడూరు నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గం ఆత్మీయ సదస్సు

???? ఆత్మీయ సదస్సు పాల్గొన్న 500 రెడ్డి కుటుంబాల నాయుకులు

????రెడ్డి సామాజిక వర్గం ఆత్మీయ సదస్సు సూపర్ సక్సస్‌

???? రెడ్డి సామాజిక వర్గం పాశిం సునీల్ కుమార్ కు లేదంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం

???? సునీల్ కుమార్ కు రెడ్డి సామాజిక వర్గం ఎంత అండగా ఉందొ…. రెడ్డి సామాజిక వర్గం ఆత్మీయ సదస్సే నిదర్శనం…

???? గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గం కీలకపాత్ర పోషిస్తుంది

???? గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహణ వారిదే..

???? ఓట్లు వేయించి విజయం వైపు నడిపేది రెడ్డి సామాజిక వర్గం…..

???? మూడు నెలల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం

???? నేను గూడూరు ఎమ్మెల్యే కావడం కుడా తథ్యం

???? టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆగిపోయి ఉన్న అభివృద్ధి పనులు ప్రారంభం

???? గూడూరు ఫ్లై ఓవర్ బ్రిడ్జ్, పంబలేరు బ్రిడ్జ్ లను పూర్తి చేస్తా

???? ప్రతీ గ్రామంలో సిమెంట్ రొడ్లు, డ్రైనేజి కాలువలు, స్కూల్ బిల్డింగ్ లు, తుఫాన్ షెల్టర్ లు, రొడ్లు, ఇండోర్ స్టేడియం, మరెన్నో అభివృద్ధి పనులు చేశాను

???? నాడు గూడూరు నియోజకవర్గం లో సుమారు 2000 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాను

???? అనారోగ్య బాధితులకు సియం రిలీఫ్ ఫండ్ 10కోట్లు తీసుకోని వచ్చి బాధితులకు ఇచ్చా

???? వైసీపీ ప్రభుత్వం లో విద్యుత్, గ్యాస్, బస్సు చార్జీలతో పేదల పై బాదుడు

????నాడు ఎన్ టి ఆర్ నుండి నేటి చంద్రబాబు వరకు రెడ్డి సామాజిక వర్గం టిడిపికి అండగా ఉన్నారు

???? ఇప్పుడు నాకు అండగా ఉన్న వారికీ అధికారం లోకి వచ్చిన వెంటనే వారి రుణం తీర్చుకుంటా

???? తెలుగుదేశం పార్టీ ఎంతోమంది నాయుకులకు పురుడు పోసింది

???? రెడ్డి సామాజిక వర్గం నాయుకులకు రుణపడి ఉంటా

???? గూడూరు నియోజకవర్గం లోని రెడ్డి సామాజిక వర్గం అండగా లేదంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం దుర్మార్గపు చర్యలు అనీ ఆ దుష్ప్రచారాలు తిప్పికోటేందుకు గూడూరు నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గం ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అనీ మాజీ గూడూరు నియోజకవర్గం శాసన సభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కోట లోని రెడ్డి సంక్షేమ భవన్ నందు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గం ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు లో గూడూరు నియోజకవర్గం లోని కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, గూడూరు పట్టణం, గూడూరు రూరల్ మండలాల నుండి 500 రెడ్డి కుటుంబాలకు చెందిన 700మంది రెడ్డి సామాజిక నాయుకులు పాల్గున్నారు.

ముందుగా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చిత్ర పటానికి మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు, టిడిపి సీనియర్ నాయుకులు, రెడ్డి సామాజిక వర్గం నాయుకులు పూల మాలలు వేసి నివాళిలు అర్పించారు. ఈ సందర్బంగా జరిగిన ఆత్మీయ సదస్సు లో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో సోషల్ మీడియా లో పాశం సునీల్ కుమార్ కు రెడ్డి సామాజిక వర్గం మద్దతు లేదు అంటూ దుష్ప్రచారాలు చేస్తూ పోస్టింగ్ లు పెట్టి హల్ చల్ చేశారు.

ఈ దుష్ప్రచారాలకు దిటైన సమాధానం చెప్పాలని ఉద్దేశ్యం తో కోట లో రెడ్డి సామాజిక ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా సునీల్ కుమార్ కు మద్దతు తెలిపేందుకు గూడూరు నియోజకవర్గం లోని అన్నీ గ్రామాల నుండి సుమారు 500 రెడ్డి కుటుంబాలకు చెందిన 700మంది రెడ్డి సామాజిక వర్గం నాయుకులు తరలివచ్చారు. ఒక్కసారి రెడ్డి సామాజిక వర్గం ఆత్మీయ సభ కు వచ్చి చూడాలనీ విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు.

అన్న ఎన్ టి ఆర్ తో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిన నాటి నుండి నేడు చంద్రబాబు వరకు టిడిపి కి రెడ్డి సామాజిక వర్గం అండగా ఉన్నారు. ఈ పార్టీలో ఎంతోమంది పెద్దలు నల్లప రెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, అన్నీ పెద్ద కుటుంబాల నాయుకులు ఉన్నారు అనీ గుర్తు చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో రెడ్లు కీలకం

గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గం నాయుకులు కీలకపాత్ర పోషిస్తూ ఓటరు జాబితా నుండి ఓటరు స్లీపు లు పంపిణి ఎన్నికల్లో ఓట్లు వేయించే వరకు వాళ్ళ కష్టం కు వెళకట్టలేము అనీ మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు. వారి దయతోనే 2014లో ఎమ్మెల్యే గా గెలిచాను. వారి రుణం ఎన్నటికీ తీర్చుకోలేను అనీ చెప్పారు. మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యం, గూడూరు ఎమ్మెల్యే గా తాను గెలవడం తథ్యం అన్నారు. టిడిపి అధికారం లోకి వచ్చిన వెంటనే ఆగిపోయి ఉన్న అభివృద్ధి పనులు తిరిగి పునః ప్రారంభం చేస్తాను అనీ ఆయన హామీ ఇచ్చారు.

నాడు గూడూరు నియోజకవర్గంలో సుమారు 2000 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి

తాను 2014నుండి 2019వరకు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు 2000 వేల కోట్ల రూపాయలతో గూడూరు నియోజకవర్గం లోని అన్నీ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు. అందులో గ్రామీణ ప్రాంతాలకు తారురొడ్లు, సిమెంట్ రొడ్లు, డ్రైనేజీ కాలువలు, పక్క గృహలు, తుఫాన్ బిల్డింగ్ లు, బడులు కట్టించడం జరిగింది అన్నారు. టిడ్కో గృహాలు, గూడూరు -దుగ్గరాజ పట్నం డబుల్ రోడ్డు నిర్మాణం, కళంగి నది బ్రిడ్జ్ ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.

అనారోగ్య బాధితుల కోసం 10కోట్ల రూపాయలు సియం రిలీఫ్ ఫండ్

గూడూరు నియోజకవర్గం లోని అన్నీ గ్రామాల్లో అనారోగ్యం తో బాధపడుతున్న అన్నీ కులాలకు చెందిన పేదల వైద్యం కొరకు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 10కోట్ల రూపాయలు నిధులు తీసుకోని వారికీ అందించినట్లు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా నియోజకవర్గం లో ఎవరూ చనిపోయిన వారి కుటుంబాలకు మరియు అనారోగ్యం తో బాధపడే వారికీ, పేద విద్యార్థులు చదువుల కొరకు సొంత నిధులు ఇస్తున్నట్లు తెలిపారు.

నాకు అండగా నిలిచిన వారికీ అండగా నిలుస్తా

త్వరలో జరిగే ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న తరుణంలో తనకు అండగా నిలిచి తన గెలుపు కొరకు కృషి చేసిన రెడ్డి సామాజిక వర్గం తో పాటు అన్నీ కులాల నాయుకులు, కార్యకర్తలు ను జీవితం లో మరిచి పోలేను అనీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారికీ అన్నీ విధాలా సహాయ సహాకారాలు అందిస్తాను అనీ వారికీ ఎల్లవేళలా అండగా ఉంటాను అనీ మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు.

గ్రామాల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నాయుకులు ఆశీస్సులు తనకు ఏళ్ల వేళల ఉంటాయి అనీ, వారికీ తాను ఎప్పుడు అండగా ఉంటాను అనీ వారి రుణం తీర్చుకుంటాను అనీ చెప్పారు. ఆత్మీయ సదస్సు కు వందలాది మంది రెడ్డి సామాజిక వర్గం నాయుకులు విచ్చేసి మీ ఆశీస్సులు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పాశం తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం లో పేదల పై కరెంట్, గ్యాస్, బస్సు ఛార్జ్ లతో బాదుడు

వైసీపీ ప్రభుత్వం లో పేదల పై కరెంట్, గ్యాస్, బస్సు ఛార్జ్ లతో బాదుతూన్న సైకో జగన్ పాలనకు శరణగితం పలకాలని మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళిత కాలనీల్లో నివసించే వారందరికీ ఎటువంటి షరతులు లేకుండా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందజేస్తామని చెప్పారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా వెంటనే పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రానికి అమరావతి రాజధానిగా నిర్ణయిస్తారు , అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని నిర్ణయించారు . రాజధాని ప్రాంతంలో అత్యధికంగా దళితులు ఉన్నారు, వారికోసం 5శాతం భూమిని రిజర్వ్‌ చేశాం, అంబేద్కర్‌ ను ఆదర్శంగా తీసుకోవడం వల్లే రాజధానిలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. అది అంబేద్కర్‌ పై చంద్రబాబుకు ఉన్న గౌరవం. మా బాబు గారు సైకో జగన్‌ లా పరదాలు కట్టుకుని రావాల్సిన పనిలేదు, తప్పుచేయలేదు కాబట్టే దమ్ముగా ప్రజల్లో తిరుగుతున్నారు .

లోకేష్ బాబు దాదాపు 3వేల కి.మీ. పాదయాత్ర చేశారు , సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకొని ఇచ్చిన హామీ లు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం లో చిత్తశుద్ధి, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత లోకేష్ బాబు తీసుకుంటారు .2019 ఎన్నికల్లో ఒక్క అవకాశమంటూ ముద్దులు పెట్టి సైకో ఎపి సిఎంగా గెలిచాడు. ఆ సైకో సిఎం అయినప్పటినుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయి. దళితులు గొంతెత్తి మాట్లాడే పరిస్థితి లేదు. దళిత సంఘాలను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనీయడం లేదు. మాస్క్‌ అడిగినందుకు డాక్టర్‌ సుధాకర్‌ ను వేధించి చంపేశారు, రాబోయేది సువర్ణ పాలన అనీ అయన తెలిపారు.

ఈ కార్యక్రమం లో టిడిపి రెడ్డి సామాజిక వర్గం నాయుకులు పలగాటి భాస్కర్ రెడ్డి, టిడిపి కోట మండలం అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి, వాకాడు మండలం అధ్యక్షులు దువ్వూరు మధు సుధన్ రెడ్డి, చిల్లకూరు మండలం అధ్యక్షులు ఉచ్చురు వెంకటేశ్వర్లు రెడ్డి, నెలబల్లి భాస్కర్ రెడ్డి, గూడూరు రూరల్ మండలం అధ్యక్షులు కో డూరు వెంకటేశ్వర్ల రాజు, గూడూరు పట్టణం అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, దువ్వూరు మస్తాన్ రెడ్డి, పట్టాభి రెడ్డి, దువ్వూరు భారతి రెడ్డి, యదనపర్తి భాస్కర్ రెడ్డి, కృష్ణరెడ్డి, నెల్లూరు మొహన్ రెడ్డి, తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు సుధాకర్ రెడ్డి, దువ్వూరు బాబీ రెడ్డి, నల్ల రెడ్డి రాజేష్ రెడ్డి, మట్టం శ్రావణి,టిడిపి నాయుకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This