గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం వైపు గడ్డం అడుగులు
స్థానికత ప్రాతిపదికన అభ్యర్థుల జాబితాలో గడ్డం సహదేవ్
సహదేవ్ పేరును పరిశీలిస్తున్న వైకాపా అధిష్టానం
తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం కొమ్మనేటూరు ఎంపీటీసీ సభ్యుడు గడ్డం సహదేవ్ అలియాజ్ వెంకట సుబ్బయ్య గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం వైపుగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. స్థానికత ప్రాతిపదికన ఎంపీటీసీ సభ్యుడు సహదేవ్ కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారి వరుసలో ఉన్నారు. వ్యాపార రీత్యా నెల్లూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో స్థిరపడినా, పుట్టిన గడ్డ మీద ఉన్న మమకారంతో అనేక కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ప్రజా క్షేత్రంలో తొలిసారిగా అడుగుపెట్టి ఎంపీటీసీ సభ్యుడుగా స్వతంత్రంగా బరిలో నిలిచారు. విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అనంతరం వైసిపి తీర్థం పుచ్చుకొని ప్రస్తుతం వైకాపాలో కొనసాగుతున్నారు. వివరాల్లోకి వెళ్తే గడ్డం సహదేవ్ గూడూరు నియోజకవర్గంలో విద్యాభ్యాసం పదవ తరగతి వరకు కొనసాగింది. ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ, ఉన్నత విద్య కోసం పట్టణాలకు వెళ్లారు. తదుపరి ఆర్టీసీ లో కండక్టర్ గా ఉద్యోగం చేశారు. ఆ సమయంలోనే ఉపాధి అవకాశాలు యువతకి కల్పించడంలో తనదైన శైలిలో ముందుకు సాగారు. నెల్లూరులో ఇమేజ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ పేరుతో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ను స్థాపించి మీ అందరితో కంప్యూటర్ రంగంలో ప్రవేశం కల్పించారు. జీవనోపాది అవకాశాలు మెరుగుపరిచారు. అనంతరం రాజకీయాలపై మక్కువతో ఉద్యోగం వదిలి స్వతంత్ర అభివృద్ధిగా గూడూరు మండలం కొమ్మనేటూరు ఎంపీటీసీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా అనేక సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు. క్రీడా పోటీల నిర్వహణలో సహకారం అందించారు. విద్యావసతులు కల్పించేందుకు తన వంతు కృషి చేశారు. ఈసారి జరిగే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందు నుంచే పావులు కలిపారు. ఈ క్రమంలో భాగంగా పార్టీ అగ్ర నాయకుల నుంచి లోకల్ గా ఉండే నాయకత్వం వరకు అందరితో సత్సంబంధాలు నెరిపారు.