Advertisements

ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ సంక్షేమ నిధి కి రూ.50 వేలు అందజేసిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్

ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ సంక్షేమ నిధి కి రూ.50 వేలు అందజేసిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్
… జర్నలిస్ట్ ల సంక్షేమానికి ఎల్లవేళలా సహకరిస్తా ..
… డాక్టర్ పాశం సునీల్ కుమార్ ….
గూడూరు : జర్నలిస్ట్ ల సంక్షేమానికి ఎల్లవేళలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని గూడూరు మాజీ ఎమ్మెల్యే, గూడూరు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ పాశం సునీల్ కుమార్ అన్నారు.గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ సంక్షేమ నిధి కి సునీల్ కుమార్ తన స్వంత నిధుల నుంచి 50 వేల రూపాయలను అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్బంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తన రాజకీయ అనుభవం లో అనేక మంది జర్నలిస్ట్ లు జీతభత్యాలు లేకపోయినా గౌరవం కోసం వృత్తి ని నమ్ముకుని వ్యక్తిగతంగా పడుతున్న ఆర్ధిక ఇబ్బందులను గుర్తించానన్నారు. సందర్బం వచ్చినపుడు పలువురికి తన వంతుగా సహకారం అందిస్తున్నానన్నారు.
గూడూరు లో ప్రింట్ మీడియా అసోసియేషన్ ఆవిర్భవించి ఒక విశ్వసనీయత కలిగిన బృందం తో కార్యవర్గం ఏర్పడడం శుభపరిణామం అన్నారు.గూడూరు జర్నలిస్ట్ ల సంక్షేమానికి తన ద్వారా 50 వేల రూపాయలు అందజేయడం సంతోషం గా ఉందన్నారు.గూడూరు ప్రజల ఆశీర్వాదం తో మరోసారి ఎమ్మెల్యే గా గెలుపొందితే జర్నలిస్ట్ లకు చట్ట బద్ధంగా ఇంటి నీవేశ స్థలాలు కేటాయింపు, గృహ నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తానని సునీల్ హామీ ఇచ్చారు.గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు షేక్ జమాలుల్లా, ఉడతా శరత్ యాదవ్,ఉపాధ్యక్షులు పర్చూరు బాలకృష్ణ, సహాయ కార్యదర్శి యళ్లంరాజు తులసి రాజు, ప్రసాద్,కోశాధికారి శశిధర్, తిరుమలశెట్టి భవానీ ప్రసాద్ ,సభ్యులు మంగళపూరు శ్రీనివాసులు, డబ్బు కృపానిధి,చిట్టెటి వెంకట నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This