కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం…!
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ రావడం తథ్యం
కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ద్వారానే ఏపీ అభివృద్ధి చెందుతుందని “కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి” అన్నారు. బడుగు బలహీన వర్గాల
పేదలు, మైనార్టీలు, ఎస్సీలు , బీసీలు దళితుల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని ఆయన అన్నారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ ముందుగా గూడూరు నియోజకవర్గ ప్రజలకు. జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రజలు సంతోషంగా ఈ నూతన సంవత్సరం లో జీవించాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు ఆకాంక్షించారు. ప్రజలు ఈసారి కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించి కేంద్రాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన కోరారు.దేశానికి స్వాతంత్య్రం సాధించిన కాంగ్రెస్ పార్టీ అనంతరం దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలను ఏర్పా టు చేసి పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు నెలకొల్పి వ్యవసాయం, ఉద్యోగావకాశాలు కల్పిం చిందన్నారు. దేశానికి సుస్ధిర ప్రభుత్వాలను అందించి దేశా భివృద్ధి, దేశ రక్షణ, ప్రజా సంక్షేమానికి సాహోసపేతమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. కౌలుదారుల రక్షణ చట్టం ద్వారా రైతు కూలీలు వారు పండించే భూములకు వారినే యజమానులను చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. బ్యాంకుల జాతీయీకరణ ద్వారా ఒకప్పుడు సంపన్నులకే అందుబాటులో ఉన్న బ్యాంకు సేవలను పేద వారికి అం దుబాటులోకి తేచ్చిందన్నారు. అనేక ప్రైవేటు కంపెనీలను జాతీయీకరణ చేసి, పబ్లిక్ రంగ సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తిని పెంచి ఉద్యోగావకాశాలు కల్పిం చి దేశాభివృద్ధికి బాటలు వేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణత్యా గం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలు అమలు చేస్తాం అని కేంద్రంలో బీజేపీ మోసం చేసింది,హోదా సాధిస్తాం అని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మాట తప్పి,మడమ తిప్పి చేతులు ఎత్తేసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని అన్నారు. 25 ఎంపీలతో కేంద్రం మెడలు వంచుతాం అని, ఇప్పుడు 22 ఎంపీలతో కనీసం ఆ వంచే ప్రయత్నం అన్న చేయకపోగా వారికి దాసోహం అయిన పరిస్తితి నెలకొంది.లోక్ సభలో,రాజ్య సభలో సముచిత స్థానం ఉన్నా,ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ హోదా విషయం కానీ, విభజన హామీలు అములు కోసం కానీ పూర్తి స్థాయి ప్రయత్నం చేయకపోవడం మన రాష్ట్ర దురదృష్టం అని అన్నారు.రాష్ట్రం ఈరోజు దివాళా తీసినట్లుగా ఉంది అని హై కోర్టు సైతం అనడం విచారకరం అని అన్నారు. గత ప్రభుత్వం లో జరిగిందే ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లో జరుగుతుంది తప్ప రాష్ట్ర అభివృద్ది కానీ సాధికారత కానీ ఒక్క శాతం కూడా పెరగడం లేదు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉండేది అని, విభజన హామీలు కానీ, ప్రత్యేక హోదా కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అని అన్నారు. రాష్ట్రం లో 151 సీట్లు ఉన్నా రాష్ట్ర అభివృద్ది జరగకపోవడం చూస్తే ప్రస్తుత ప్రభుత్వ చేతకాని తనం కనిపిస్తోందని, పోయిన ప్రభుత్వం లో కనీసం కొన్ని అయినా అమలు జరిగాయి, ఇప్పుడు అవి కూడా జరగక రాష్ట్రం దివాళా తీసి భూములు అమ్ముకునే పరిస్తితి,రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించకపోవడం వళ్ళే రాష్ట్రంలో ఈ దుస్థితి ఏర్పడిందన్నారు.రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ చట్టం,దిశ వ్యవస్థ వల్ల అనుకున్న ఫలితాలు రావట్లేదు అన్నట్టేన అని ప్రజలు అనుంటున్నరు అని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ అధికారులను సైతం ఎలా ఇబ్బంది పెడుతుంది అనేది, ఇప్పటికైనా ప్రభత్వం ప్రతిపక్షాల సూచనలను పాజిటివ్ గా తీసుకొని, అధికారులకు స్వేచ్ఛ ను ఇచ్చి, ప్రజల ప్రభుత్వంగా ముందుకు వెళ్తే 5 యేళ్లు పూర్తిగా ఉంటుందని,లేకపోతే అది కూడా కష్టమే అని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలు యువత కాంగ్రెస్ పార్టీ లో చేరుటకు సిద్దం అవుతున్నారని ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించి కేంద్రాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన పిలుపునిచ్చారు.