Advertisements

గూడూరు ప్రింట్ మీడియా నూతన కార్యవర్గం ఎంపిక

గూడూరు : గూడూరు పట్టణంలో ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపికైంది. గురువారం గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఆ అసోసియేషన్  సభ్యులు ప్రకటించారు. గౌరవాధ్యక్షులుగా ఇస్కపల్లి శివ ప్రసాద్, చిరువెళ్ల కృష్ణ మోహన్, గౌరవ సలహాదారులుగా మల్లవరపు మనోహర్ రెడ్డి, గుంటమడుగు సుబ్బరామరాజు, ఆనిమెళ్ల శివ కుమార్, ప్రధాన అధ్యక్ష కార్యదర్శులుగా షేక్. జమాలుల్లా, ఉడతా శరత్ యాదవ్, ఉపాధ్యక్షులుగా మీజూరు మల్లికార్జున్ రావు, పేటేటి గిరీష్ కుమార్, పరుచూరు బాలకృష్ణ, కార్యనిర్వాహక కార్యదర్శిగా గుమ్మడి అనిల్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా తిరుమలశెట్టి భవానీప్రసాద్, సహాయ కార్యదర్శిగా తులసీరాజు, పరిశీలకులుగా బాబూ మోహన్ దాస్, ఆత్మకూరు సురేష్, శానాటి సుధీర్, కార్యవర్గ సభ్యులుగా చిట్టెంశెట్టి ప్రసాద్, మంగళపూరు శ్రీనివాసులు, సవరపు కిషోర్ కుమార్, చిట్టేటి నిరంజన్, నన్నూరు లక్ష్మణ్, డబ్బు కృపానిధిలను ఎన్నుకున్నారు.

Leave a Comment

You May Like This