Advertisements

55 లక్షల 87 వేల రూపాయలను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకితీసుకున్నా  గూడూరు పోలీసులు

తిరుపతి జిల్లా గూడూరు  జాతీయ రహదారిపై ఎటువంటి బిల్లులు లేకుండా బస్సులో తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు…   హైదరాబాద్ నుండి చెన్నై వైపు వెళ్లే ప్రైవేటు
ట్రావెల్ బస్సులో  55 లక్షల 87 వేల రూపాయలను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు… ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రూరల్ పోలీసులకు వచ్చిన సమాచారంతో బస్సులో తనిఖీ చేయగా బస్సు బెడ్ షీట్ల క్రింద ఉంచిన నగదును గుర్తించామని అన్నారు.. పట్టుబడిన నగదుకు ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేశామని వెల్లడించారు.. బంగారం కొనుగోలుకు కోసం చెన్నై కు నగదును తీసుకు వెళ్తున్నట్లు సంబంధిత వ్యక్తులు వెల్లడించినట్లు డిఎస్పి తెలిపారు.. పట్టుబడ్డ నగదును ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పగిస్తామని అన్నారు…

Leave a Comment