Advertisements

యువగలం సభతో ప్రజల్లో మార్పు మొదలైంది- టీడీపీ

తిరుపతి జిల్లా గూడూరు
మాజీ శాసన సభ్యులు, పాశిం సునీల్ కుమార్  ఆదేశాల మేరకు
పట్టణలోని పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ టీడీపీ నాయకులు  మాట్లాడుతూ
రాష్ట్రంలో యువగలం సభతో ప్రజల్లో మార్పు మొదలైందని అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఆరాచక పాలనకు నిరసనగా జనవరి 27 వ తేదీన మా యువ దళపతి నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుండి
ఈ రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్రను జరగనివ్వకుండా  ప్రభుత్వం ఎన్నో అడ్డంకులను సృష్టించిందని అయన మా నాయకుడు ఎక్కడ వెనక్కి తగ్గకుండా పాదయాత్ర చేస్తూ చంద్రన్న అదికారంలోకి వస్తే చేయబోయే హామీలను ప్రజలకు తెలుపుతూ 226 రోజుల పాటు 90 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర  దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు. పాదయాత్ర ముగింపు లో భాగంగా మొన్న పోలేపల్లి నందు జరిగిన యువగలం  నవశకం ప్రారంభం కార్యక్రమంకు మా ఇంచార్జ్ – సునీల్ కుమార్  అధ్వర్యంలో 600 మందితో నియోజకవర్గం నుండి పాల్గొన్నామని తెలపారు.
ఆ వేడుక అశేష అశేష జనవాహిని మధ్య జరిగిందని  అక్కడ జనం ను చూస్తే తెలుస్తుంది ప్రభుత్వం పై ఎంత వ్యతిరేకత ఉందొ ని గుర్తు చేసారు.ఈ సైకో పాలన ను దింపడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్  మా చంద్రన్నతో కలసి పనిచేస్తున్నారు.ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగడానికి ఎంతో కాలం లేదుని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్,కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి,పట్టణ మండల పార్టీ అద్యక్షులు పులిమి శ్రీనివాసరావు,కొండూరు వెంకటేశ్వర్లు రాజు,జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచు రామయ్య,దువ్వూరు రవీంద్ర రెడ్డి,కాకాణి తిరుపాల్,నటశేఖర్, నియోజకవర్గ మైనారిటీ అద్యక్షులు MD అబ్దుల్ రహీం,నియోజకవర్గ SC సెల్ అద్యక్షులు ఎసుపాక పెంచలయ్య,పట్టణ కమిటీ కోశాధికారి తక్కిల్ల పాటి చంద్ర మౌళి, యువత వేముల సునీల్,రాజు,షాహుల్,అరవ పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment