Advertisements

ప్రీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు.

ప్రీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు.

తిరుపతి జిల్లా గూడూరు పట్టణం చర్చి స్ట్రీట్ లోనిపాస్టర్ డానియేలు రవికుమార్ వారి సార్వత్రిక క్రైస్తవ ప్రార్థనామందిరం లో ప్రీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే, గూడూరు ఎంపీపీ గురవయ్య, సతీష్ రెడ్డి.

చిన్నారుల ఆటలతో ప్రార్థనా మందిరం ఆనందం తో నిండిపోయింది.చిన్నారుల ఆట పాటలను చిరు నవ్వు తో శ్రద్దగా తిలకించిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు.

తిరుపతి జిల్లా గూడూరు పట్టణం లోని ప్రార్థనా మందిరంలో పాస్టర్ డానియేలు రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకలకువైసీపీ నాయకులతో కలిసి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రీక్రిస్మస్ వేడుకలకు వచ్చిన దేవుని బిడ్డలకు, నాయకులకు, పాస్టర్ లకు ముందుగా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ:
నేను చిన్న తనంలో ఉన్నప్పుడు మా నాన్న నన్ను పొలం పనులకు పంపిస్తే ఆదాయం వస్తుందని నన్ను పొలం పనులకు వెళ్లాలని చెప్పి, అదేమాట మా అమ్మ కి చెబితే దానికి ఆమె ఒప్పుకోకుండా, లేదు ప్రసాద్ ని పొలం పనులకు పంపించేది లేదు. ప్రసాద్ ని చదివించాలని గట్టిగా మా నాన్న తో చెప్పి ఆరోజుల్లో నన్ను క్రిస్టియన్ స్కూల్ లో చేర్పించిన సంగతి గుర్తు చేశారు. అక్కడ రోజు కు రెండు సార్లు యేసు ప్రభువు ప్రార్థన, బైబిల్ లోని ప్రవచనాలు చెప్పుకుంటూ చదుకున్నాను అని అలా దాదాపు 10సంవత్సరాలు అదే యేసు ప్రభువు సన్నిధిలో చదువుకున్నాను అని తెలిపారు. ఇంకోమాట, ఏదయినా చిన్న తనం లో అలవాటు చేసుకుంటే అది ఎప్పటికీ పోదు అని కూడా తెలిపారు. అప్పటి నుండి నాకు యేసుప్రభువు అంటే అంత గౌరవం అని తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కానీ, ఆయన తండ్రి దివంగత మహానేత రాజశేఖరరెడ్డి కానీ ప్రభువు బిడ్డలేనని, ఇప్పటికి కూడా విజయమ్మ చేతిలో బైబిల్ లేనిదే ఎక్కడకూ రాదని, అదే ప్రభువు మీద వారికి ఉన్న నమ్మకం అని తెలిపారు. బైబిల్ లో ప్రభువు చెప్పినట్లుగా జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు అని కూడా ఈ సందర్బంగా తెలియజేస్తున్నాను అన్నారు. అంతేకాకుండా క్రిస్టియన్ పాస్టర్ లకు నెలకు 5000రూపాయలు వేతనం ఇస్తున్న గొప్ప దేవుని బిడ్డ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈరోజు 52పుట్టినరోజు జరుపుకుంటున్న ముఖ్యమంత్రి కి పాస్టర్ లు, దేవుని బిడ్డలు ఆశీస్సులు ఇస్తూ ఆయన నిండునూరేళ్ళు జీవిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా 30సంవత్సరాలు పరిపాలించేలా ప్రభువు ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థన లు చేశారు. పాస్టర్ డానియేలు రవికుమార్ మాట్లాడుతూ, ప్రభువా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఆశీర్వదించి, ఆయనకు శ్రమ కలగకుండా, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కాకుండా, మరెన్నో పథకాలు పెట్టి, ప్రజలకు మంచి చేసి చరిత్ర లో నిలిచి పోయేలా ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థన చేశారు. అనంతరం పాస్టర్ రవికుమార్ ఏర్పాటు చేసిన కేకు ను ఎమ్మెల్యే, పాస్టర్, గురవయ్య, సతీష్ రెడ్డి కట్ చేశారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్బంగా డైరీ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే వెంట వైసీపీ నాయకులు కొండూరు సునీల్ రెడ్డి, మహేంద్ర యాదవ్, ప్రభాకర్ రాజు, దయాకర్ యాదవ్, అశోక్, హరీష్ రెడ్డి, చర్చి మెంబెర్ లు మల్లికార్జున్,కే, రవి, రవి, చర్చి అపొస్తులు పాల్గొన్నారు.

Leave a Comment