Advertisements

గొట్టికాడు గ్రామం లో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన..

గొట్టికాడు సర్పంచ్ వెందోటి.సుప్రజ

తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం గొట్టికాడు సచివాలయం పరిధిలోని గొట్టికాడు గ్రామం లో వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సూచనల మేరకు గొట్టికాడు సర్పంచ్ వెందోటి సుప్రజ ఆధ్వర్యంలో గొట్టికాడు గిరిజన కాలనీలో వరద బాధితులకు గురువారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెందోటి సుప్రజ మాట్లాడుతూ గొట్టికాడు గిరిజన కాలనీలో మీ చౌంగ్ తుఫానుతో గిరిజనులు ఉపాధి కోల్పోయారని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి ఆర్థిక సహాయము చేయాలని కోరగా స్పందించిన అధికారులు పనులు లేక ఉపాధి కోల్పోయిన గిరిజన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం బియ్యం , కందిపప్పు, నగదు ను పంపిణీ చేస్తుందన్నారు. పేదల సంక్షేమమే అభివృద్ధి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. గొట్టికాడు గ్రామం గిరిజన కాలనీ లో బియ్యం, కందిపప్పు నగదు ను ఈ సందర్బంగా పంపిణీ చేయడం జరిగింది అని వెందోటి సుప్రజ అన్నారు .ఈ కార్యక్రమం లో సర్పంచ్ వెందోటి.సుప్రజ, పంచాయతీ కార్యదర్శి పెంచలయ్య , సచివాలయ సిబ్బంది, వరద బాధితులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Comment