Advertisements

ఎమ్మార్వో కి, ఆర్డిఓ కి, జిల్లా కలెక్టర్ కి సిఫారసు చేస్తూ లెటర్ రాసిన ఎమ్మెల్యే 

తుఫాన్ ప్రభావంతో ముంపుకు గురైన కుటుంబాలకు ప్రభుత్వం వారు, వారికి సహాయంగా నష్టపరిహారంగా అందజేస్తున్న ఆర్థిక సహాయం మరియు నిత్యవసర సరుకులైన బియ్యం, వంటనూనె, కందిపప్పు, బంగాళదుంపలు ఎర్రగడ్డలు, వంటి సరుకుల పంపిణీ అందరికీ ఇవ్వలేదని, గూడూరు పట్టణంలోని 1వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు కోడూరు మీరా రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రావడంతో విజయవాడ నుండి నేరుగా అంబేద్కర్ నగర్ కి చేరుకుని స్థానిక ప్రజలను పరామర్శిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని అంబేద్కర్ నగర్ లోని వీధులలో తిరుగుతూ వారి ఇళ్ళలను పరిశీలించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారందరికీ ప్రభుత్వం సహాయం అందే విధంగా చేస్తానని భరోసా ఇచ్చి తక్షణమే ఎమ్మార్వో కి, ఆర్డిఓ కి, జిల్లా కలెక్టర్ గారికి సిఫారసు చేస్తూ లెటర్ రాసిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడిన శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద్ రావు

Leave a Comment