గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లో వెలిసియున్న శ్రీ శ్రీ శ్రీ తాళమ్మ దేవస్థానం ఆలయ ప్రాంగణంలో శనివారం రాత్రి శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా పూజ నిర్వహించారు. గురు స్వాములు వీర ఆంజనేయస్వామి ఆధ్వర్యంలో .పడి మహోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వినాయక స్వామి. వెంకటేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అయ్యప్ప స్వామి. మహాలక్ష్మి దేవతామూర్తులకు ప్రత్యేకంగా పూల మండపాలను ఏర్పాటు
చేసి పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి. సుబ్బారావు స్వామి. సురేష్ స్వామి. బి మనీ . డి వంశీకృష్ణ స్వాముల సహకారంతో ఈ పూజ కార్యక్రమాలను నిర్వహించారు . ఈ సందర్భంగా గురుస్వామి వీరాంజనేయులు మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష ప్రశాంతతకు రక్షా.అని. పరివర్తనను తీసుకువచ్చేందుకే మాలధారణని. కఠిన నియమాలతో కారుణ్యమూర్తికి సేవ చేయడం మణికంఠుని నామ స్వరమే పూర్వజన్మ సుకృతం అని పేర్కొన్నారు. మనుషులంతా ఒకటేనంటూ సమానత్వాన్ని చాటేదే అయ్యప్ప దీక్ష మహిమ అన్నారు. శని గోషా నుంచి విముక్తి కలిగించేందుకే అయ్యప్ప స్వామి ను నల్లా దుస్తులు ధరిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి ధర్మ ప్రచార పరిషత్ కోఆర్డినేటర్ స్వామి నాయక్. సభ్యులు మిరియం వెంకటేశ్వర్లు . రఘు. వెడిచర్ల సుధాకర్ తో పాటు వైయస్సార్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు. సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకులు బత్తిని విజయకుమార్. తిరుపతి జిల్లా బీసీ సెల్ కన్వీనర్ బట్ట గోపి యాదవ్. వైఎస్ఆర్సిపి నాయకులు ముప్పాల చంద్ర మోహన్ రెడ్డి తో పాటు. చెంచయ్య .చింతల శ్రీనివాసులు. విజయకుమార్ . వెంకటేశ్వర్లు సూర్యనారాయణ. పలువురు పట్టణ ప్రముఖులు. స్వాములు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు..