Advertisements

అంగన్వాడి ఉద్యోగస్తులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది

తిరుపతి జిల్లా అధ్యక్షుడు పంట శ్రీనివాసులు రెడ్డి

అంగన్వాడీ ఉద్యోగస్తులకు కనీస వేతనం 27000 రూపాయలు చొప్పున ఇవ్వాలి

కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు పంట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం

తిరుపతి జిల్లా గూడూరు స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు తిరుపతి జిల్లా అధ్యక్షుడు పంట శ్రీనివాసులు రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగస్తులకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు అండగా ఉంటామని వాళ్లకు కనీస వేతనం ఇవ్వకుండా వాళ్లని ఇబ్బందులు గురిచేయడం ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదు  ఈరోజు అంగన్వాడి ఉద్యోగస్తులు రోడ్డు మీదకు వచ్చి బిక్షాటన చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యం వల్లనేనని ఈ ప్రభుత్వం తెలుసుకొని వాళ్లకు  కనీస వేతనం టీచర్ కి  27,000 ,ఆయమ్మకి17000 ,రూపాయల చొప్పున ఇస్తే వాళ్ళ ఇంట్లో కూడా జరుగు పాటు అవుతుందని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి అంగన్వాడీ ఉద్యోగస్తులను గుర్తించి వాళ్లకి కనీసం వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు మండల ప్రెసిడెంట్ వేమయ్య, గూడూర్ టౌన్ ప్రెసిడెంట్ బండి భాస్కర్ రెడ్డి ,మండల నాయకులు దర్శి ,నాగభూషణం, సిద్దయ్య మూర్తి ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Comment