Advertisements

ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రారంభం హర్షణీయం


సీపీఐ పట్టణ కార్యదర్శి షేక్ కాలేషా
సీపీఐ నాయకులు


గూడూరు రైల్వే స్టేషన్ అధికారులు స్పందించి రెఞడవ పట్టణం నుండి ఒకటవ పట్టణానికి ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని పునః ప్రారంభించడం హర్షణీయమని సీపీఐ పట్టణ కార్రదర్శి షేక్. కాలేషా అన్నారు. శనివారం గూడూరులోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనాలో మూసివేసిన రైల్వే వంతెనను సీపీఐ, ఇన్సాఫ్ సమితిల ఆధ్వర్యంలో చేసిన నిరసనల ఫలితంగా రైల్వే ఉన్నతాధికారులు స్పందించారని అన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్. ప్రభాకర్ మాట్లాడుతూ టిడ్కో గృహాలలో మంచినీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. చెట్టు, పుట్టలను తొలగించి టిడ్కో గృహ సముదాయాలలో పాములు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జీ. శశి కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సీవీఆర్. కుమార్, ఏఐటీయూసీ నాయకులు కే. నారాయణ, ఎంబేటి చంద్రయ్య, ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్.జమాలుల్లా పాల్గొన్నారు.

Leave a Comment