Advertisements

ఆయుర్వేద భవనం ఇక మహిళా మండలికి


ప్రభుత్వం తరపున అందిన ఉత్తర్వులను చూపిస్తున్న మహిళా మండలి సభ్యులు


గూడూరు పట్టణంలోని ఆంధ్ర మహిళా మండలికి దర్గా వీధిలోని ఆయుర్వేద భవనం స్థలాన్ని కేటాయించినట్లు ఆ మండలి అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి హర్షం వ్యక్తం చేశారు. శనివారం డాక్టర్ సీఆర్. రెడ్డి హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా మండలి గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రి వెనుక వైపున 195 అంకణాలు ఆంధ్ర మహిళా మండలికి సంబంధించిన స్థలం, భవనం ఉండేదన్నారు. ఏరియా ఆస్పత్రి అభివృద్ధిలో భాగంగా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఆ స్థలానికి బదులుగా శిథిలమైన ఆయుర్వేద ఆస్పత్రి స్థలాన్ని కేటాయించారని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Comment